పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే..

24 Nov, 2021 08:51 IST|Sakshi

తిరువొత్తియూరు( చెన్నై): నీలగిరిలో ఏడేళ్ల బాలుడిని అమ్మవారి ఆలయంలో పూజారిగా నియమించడంపై దేవదాయశాఖను హైకోర్టు వివరణ కోరింది. నెడుకాడు గ్రామంలో గేల్తై అమ్మన్‌ ఆలయం ఉంది. అమ్మవారు ఓ సామాజిక వర్గానికి కులదేవత. 1994 మే 25న ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. వంశపార్యంపర్యంలో భాగంగా గోపాలకృష్ణ కుమారుడు రాణేష్‌ (7)ను పూజారిగా నియమించారు.

ఇక్కడ పూజారిగా ఉండే వారు పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీనిపై నీలగిరి జిల్లా కొత్తగిరి గ్రామానికి చెందిన టి.శివన్‌ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఇన్‌చార్జ్‌ ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాథ్‌ బండారి, ఆదికేశవులు బెంచ్‌ మంగళవారం విచారణ చేపట్టింది. పూజారిగా నియమించడం వల్ల బాలుడి చదువు ఆగిపోయిందని..అతని భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు దేవాదాయశాఖను ఆదేశించారు.

చదవండి: MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్‌ సిక్సర్‌.. ధోని ఫొటో వైరల్‌

మరిన్ని వార్తలు