నేటి ముఖ్యాంశాలు

9 Dec, 2020 08:50 IST|Sakshi

కోలుకున్న ఏలూరు 
అంతుచిక్కని అనారోగ్యం బారిన పడిన బాధితులకు అత్యున్నత వైద్య చికిత్స అందిస్తూనే కారణాలను గుర్తించేందుకు వివిధ రకాల నమూనాల విశ్లేషణ కొనసాగుతోంది. ఇక ఆస్పత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
పూర్తి వివరాలు

సీఎం జగన్‌ ఉదారత
ఏలూరులో వింత వ్యాధికి గురై అస్వస్థతతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలిచారు. అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి వివరాలు


నేరేడ్‌మెట్‌ : ప్రారంభమైన కౌంటింగ్‌
జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్​మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ముగిసింది. నేరేడ్​మెట్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
పూర్తి వివరాలు

హోరెత్తిన 'జై కిసాన్'
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ విజయవంతమైంది. రైతులు, వారి మద్దతుదారుల దేశవ్యాప్త నిరసన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, విజయవంతంగా ముగిసింది.
పూర్తి వివరాలు


మంత్రి మల్లారెడ్డిపై కేసు
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్‌ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్‌ ఠాణాలో ఆరో తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదయింది.
పూర్తి వివరాలు

మొబైల్‌ టెక్నాలజీతో టీకాలు..
భారీ స్థాయిలో చేపట్టనున్న కోవిడ్‌–19 టీకాల కార్యక్రమంలో మొబైల్‌ టెక్నాలజీని వినియోగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
పూర్తి వివరాలు

బ్రిటన్‌లో ఫైజర్‌ టీకా మొదలు
యూకే తన చరిత్రలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్, బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ప్రజలకు  ఇవ్వడం ప్రారంభించింది.
పూర్తి వివరాలు

నిహారికకు మెగాస్టార్ స్పెష‌ల్ గిఫ్ట్‌
త‌న పిల్ల‌ల‌తోపాటు, త‌మ్ముడు, చెల్లెల పిల్ల‌ల‌ను కూడా స‌మానంగా చూసే చిరంజీవి కొత్త‌పెళ్లి కూతురు నిహారికక కోసం ఓ స్పెష‌ల్ గిఫ్ట్ తీసుకున్నార‌ట‌.
పూర్తి వివరాలు


చివరిది చేజారింది
భారత్‌–ఆ్రస్టేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు సమంగా ముగిశాయి. మంగళవారం జరిగిన మూడో టి20లో ఆసీస్‌ 12 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
పూర్తి వివరాలు

ఒక్క కిడ్నీ.. వేయి విజయాలు
అంజూ జార్జ్‌ ఇవాళ ట్విటర్‌ ద్వారా క్రీడా ప్రపంచాన్ని, అభిమానుల్ని ఉలిక్కిపడేలా చేశారు. 2003లో భారత్‌కు ప్రపంచ పతకం సాధించే సమయానికి నేను ఒక్క కిడ్నీతోనే ఉన్నానని వెల్లడించారు.
పూర్తి వివరాలు

మరిన్ని వార్తలు