టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

10 Dec, 2020 17:57 IST|Sakshi

మహిళలకు మెరుగైన జీవనోపాధే లక్ష్యంగా..
వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల్లో అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో చేపట్టిన మేకలు, గొర్రెల పంపిణీ ‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టగా, మొత్తం రూ.1869 కోట్ల వ్యయంతో పథకం అమలు చేస్తున్నారు. పూర్తి వివరాలు..

ఏలూరు వింత వ్యాధి; కీలక విషయాలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. అయిదోరోజు బాధితుల సంఖ్య తగ్గడంతో ఏలూరు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు..

సిద్ధిపేటపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు
సిద్ధిపేట జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. సిద్దిపేట పర్యటనలో భాగంగా గురువారం ఆయన మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి రూ.45 కోట్లతో సిద్ధిపేట శివారులో నిర్మించనున్న ఐటీ టవర్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు..

పీసీసీ ఇస్తే పార్టీని గాడిలో పెడతా: కోమటిరెడ్డి
తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. అధ్యక్షుడి పదవికి పలువురు సీనియర్‌ నేతలు పోటీ పడుతుండగా.. హైకమాండ్‌ అందరి అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలో మకాం వేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ గురువారం గాంధీ భవన్‌లో మరోసారి కోర్‌కమిటీ నేతలతో సమావేశమయ్యారు. పూర్తి వివరాలు..

భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక: మోదీ
నూతన పార్లమెంట్‌ భవనం దేశ ప్రజలందరికీ గర్వకారణమని, భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత భవనం భారత ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసిందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో నూతనంగా అన్ని వసతులతో నిర్మించనున్న పార్లమెంట్‌ భవనానికి ప్రధాని భూమి పూజ చేశారు.

నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి
రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురయ్యింది. టీఎంసీ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్‌పై దాడి చేశారు.. రాళ్లు రువ్వారు. పూర్తి వివరాలు..

‘వ్యాక్సిన్ల’ పై బ్రెజిల్‌ గుణపాఠం
ప్రాణాంతక కరోనా వైరస్‌ను ఎదుర్కొనే పలు కోవిడ్‌ వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుండగా, బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సోనారో మాత్రం పూర్తి నిర్లిప్తంగా ఉన్నారు. ‘నేను వ్యాక్సిన్‌ తీసుకునే ప్రసక్తే లేదు’ అంటూ ఆయన నవంబర్‌ 26వ తేదీ నుంచి సోషల్‌ మీడియా ముఖంగా చెబుతూ వస్తున్నారు. ఆయన మాస్కులు ధరించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. పూర్తి వివరాలు..

కాన్సర్‌తో ప్రముఖ డ్యాన్సర్‌‌ కన్నుమూత
భారతీయ ప్రముఖ నాట్యకారుడు అస్తాద్‌ డెబూ(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ముంబైలోని నివాసంలో అస్తాద్‌ మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు...

దుమ్మురేపిన కోహ్లి.. రెండో స్థానంలో రోహిత్‌
2020 ఏడాది ముగింపు సందర్భంగా గురువారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఆసీస్‌ టూర్‌లో రెండు హాఫ్‌ సెంచరీలతో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 870 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. పూర్తి వివరాలు..

ఆ ఫోన్లు కొనకండి అంటున్న నాగార్జున
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని ఇప్పటికి అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయస్సులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కష్టపడుతూ హ్యాండ్సమ్‌ లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నాగార్జున ఆపిల్‌పై తన ఆగ్రహాన్ని ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు..
 

మరిన్ని వార్తలు