లేచి నిలబడి భారత అథ్లెట్లకు చప్పట్లతో ప్రధాని స్వాగతం

23 Jul, 2021 19:36 IST|Sakshi
చప్పట్లతో భారత క్రీడాకారులకు స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: విశ్వ క్రీడా సంబురం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఒలింపిక్స్‌ క్రీడా పోటీల ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. భారతదేశానికి చెందిన క్రీడాకారులు వేదికపైకి రాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చప్పట్లతో స్వాగతం పలికారు. టీవీలో క్రీడా ప్రారంభోత్సవాలు చూస్తూ మన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ‘అందరూ చీర్స్‌ ఫర్‌ ఇండియా చేద్దాం రండి’ అంటూ ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఢిల్లీలోని తన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒలింపిక్స్‌ క్రీడా వేడుకలను టీవీలో స్వయంగా వీక్షించారు. భారత క్రీడాకారులు వేదిక మీదకు రాగానే ప్రధాని మోదీ లేచి నిలబడి చప్పట్లు చరుస్తూ వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వజ్రాల్లాంటి క్రీడాకారులంటూ ‍ప్రశంసిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌ వేదికపై భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత జెండాని పట్టుకుని భారత బృందాన్ని నడిపించారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో‌ ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. వీరిలో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఆగస్టు 8వ తేదీ వరకూ టోక్యో ఒలింపిక్స్ కొనసాగనున్నాయి.
 


 

భారత క్రీడాకారులు వేదికపైకి వస్తున్న వీడియో చూడండి
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు