Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

23 Jun, 2022 16:55 IST|Sakshi

1.. తిరుపతి: పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్‌ శ్రీకారం


రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని, మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. టీసీఎల్‌ ద్వారా 2వేల మందికి, ఫాక్స్‌ లింగ్‌ ద్వారా 2 వేల మందికి, సన్నీ ఆప్కోటెక్‌ ద్వారా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్‌ అన్నారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. Maharashtra Crisis: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన ప్రకటన


శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన ప్రకటన చేశారు. సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.  24 గంటల్లో రెబల్‌ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటే.. కూటమి నుంచి వైదొలిగే అంశాన్నిపరిశీలిస్తామని అన్నారు. తమ డిమాండ్లన్నీ పరిగణలోకి తీసుకుంటామన్నారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. ఆత్మకూరు ఉపఎన్నిక: మధ్యాహ్నం 3 గంటల వరకు 54.66 శాతం పోలింగ్‌


నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నిక కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 54.66 శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మ.3 గంటల వరకు 51.3శాతం పోలింగ్‌ నమోదైంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. సికింద్రాబాద్‌ విధ్వంసం కేసులో కీలక పరిణామం


సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విధ్వంసం రోజున ఆవుల సుబ్బారావు ఉప్పల్‌ అకాడమీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు, శివ ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో ఉన్నారు. 
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. మహారాష్ట్ర సంక్షోభం.. హాట్‌ టాపిక్‌గా మారిన నెంబర్‌ గేమ్‌!


మహారాష్ట్ర సస్పెన్స్‌ అంతకంతకూ పెరిగిపోతుంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కఠను రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో నంబర్‌ గేమ్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలోని భాగస్వామ్యమైన శివసేన పార్టీలో చీలిక దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6..  Jerry Hall- Rupert Murdoch: పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్‌ విడాకులు!


ఈ కాలంలో మాత్రం ఈ మూడు ముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. కొన్ని నెలలు లేదా సంవత్సరాలకే నువ్వు నాకొద్దు బాబోయ్‌ అంటూ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో పెళ్లి, విడాకులు సర్వసాధారణమయ్యాయి. తాజాగా మీడియా మొఘల్‌ రూపర్ట్‌ ముదోర్చ్‌, మోడల్‌, నటి జెర్రీ హాల్‌ వివాహ బంధానికి స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. India Vs Leicestershire 2022: భారత జట్టులో తెలుగు తేజాలు.. విహారి, భరత్‌.. మరి పంత్‌?


ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టుకు ముందు లీసెస్టర్‌షైర్‌ కౌంటీతో టీమిండియా వార్మప్‌ మ్యాచ్‌ మొదలైంది. లీసెస్టర్‌లోని గ్రేస్‌రోడ్‌ స్టేడియంలో నాలుగు రోజుల పాటు ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఛతేశ్వర్‌ పుజారా, రిషభ్‌ పంత్‌, పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్‌ కృష్ణ లీసెస్టర్‌ఫైర్‌ తరఫున బరిలోకి దిగారు.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. ఎలక్ట్రిక్ బైక్‌ మంటలు, లెక్కలు తేలాల్సిందే: కంపెనీలకు నోటీసులు


లక్ట్రిక్  బైక్స్‌ వరుస అగ్నిప్రమాద ఘటనలపై కేంద్రం స్పందించింది.  దీనిపై 15 రోజుల్లో  వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా కంపెనీలకు నోటీసులిచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాల ఘటనలను సుమోటోగా  స్వీకరించిన కేంద్రం, అగ్ని ప్రమాదానికి గల కారణాలను వివరించి, నాణ్యతా ప్రమాణాల వివరణ ఇవ్వాలని వినియోగదారుల పర్యవేక్షణ సంస్థ ద్వారా ఓలా ఎలక్ట్రిక్‌కు  నోటీసులు జారీ చేసింది.  
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. చైనాలో రికార్డు స్థాయిలో వరదలు...వందల ఏళ్లలో లేని విధంగా..


చైనా భారీ వర్షాల కారణంగా రికార్డు స్థాయిలు వరదలు ముంచెత్తాయి. వందల ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయిలో భారీ వరదలు సంభవించాయి. దక్షిణ చైనా ఈ వరదల కారణంగా అతలాకుతలమైంది. చైనా టెక్‌ రాజధాని షెనజెన్‌, లాజిస్టిక్స్‌ హబ్‌ అయిన గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10.  Shanan Dhaka: ‘ఎన్డీయే’ ఎగ్జామ్‌ టాపర్‌ ఈమె!


డిఫెన్స్‌ అకాడమీలో అమ్మాయిలా?’ అనే అజ్ఞాత ఆశ్చర్యం మొన్న. ‘అమ్మాయిలు అద్భుతమైన విజయాలు సాధించగలరు’ అనే ఆత్మవిశ్వాసం నిన్న. ‘అవును. అది నిజమే’ అని చెప్పే వాస్తవం ఇవ్వాళ...
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు