యోగి సర్కారుపై అసమ్మతి స్వరం.. అమిత్‌షాను కలువనున్న మంత్రి!

20 Jul, 2022 10:53 IST|Sakshi

Yogi Adityanath cabinet.. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న బీజేపీ సర్కార్‌లో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ నిర్ణయాలపై కాషాయ పార్టీ నేతలు, మంత్రులు గుర్రుగా ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

వివరాల ప్రకారం.. యూపీ జలశక్తి శాఖ సహాయ మంత్రి దినేష్ ఖటిక్ యోగి ప్రభుత్వం నుండి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే, పీడబ్ల్యూడీ మంత్రి జితిన్‌ ప్రసాద్‌ కూడా యోగి సర్కార్‌పై అసంతృప్తితో ఉన్నారని జాతీయ మీడియాతో కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా, అయితే తన ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(OSD) అధికారి అనిల్‌కుమార్‌ పాండే బదిలీపై జితిన్‌ ప్రసాద్‌ అసంతృప్తి వ్యక్తపరిచినట్టు సమాచారం. కాగా, అనిల్‌ కుమార్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. తన శాఖలో బదిలీలు, హస్తినాపురంలో తన మద్దతుదారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం పట్ల జలశక్తి సహాయ మంత్రి దినేష్‌ ఖటిక్‌.. సీఎం యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఖటిక్‌.. తన ప్రభుత్వ అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి, వాహనాన్ని వదిలిపెట్టి హస్తినలోని తన వ్యక్తిగత నివాసానికి వెళ్లినట్లు సమాచారం. కాగా, మంగళవారం అర్థరాత్రి వరకు ఇద్దరు మంత్రుల ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉండటం గమనార్హం. మరోవైపు.. యూపీలో ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోం మంత్రితో జితిన్‌ ప్రసాద్‌ బుధవారం సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: తమిళనాడు మరో ట్విస్ట్‌.. పన్నీర్‌సెల్వానికి ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు