అల్లుడితో షూట్‌ చేయించుకున్న మామ..ఎందుకంటే..?

25 Nov, 2023 20:22 IST|Sakshi

న్యూఢిల్లీ : అప్పులోళ్లను ఇరికించేదుకు ఓ వ్యక్తి తన అల్లుడితో కలిసి పెద్ద కుట్రే పన్నాడు. కానీ పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కించే పరిస్థితి తెచ్చుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన అల్లుడికి తుపాకీ ఇచ్చి చేతిపై ఘూట్‌ చేయించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి అ‍ప్పు కోసంవేధిస్తూ అప్పులోళ్లే తనను కాల్చారని చెప్పాడు. ఈ ఘటన  ఢిల్లీలోని నంద్‌ నగ్రీ తాహీర్‌పూర్‌లో జరిగింది.

కాల్పులు జరిగాయని ఫోన్‌ వచ్చిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి చూశారు. చేతికి గాయంతో ఉన్నసుందర్‌ కనిపించాడు. 315 బోర్‌ తుపాకీకి చెందిన ఖాళీ షెల్‌ అక్కడే పడి ఉంది. గాయపడిన సుందర్‌తో పాటు అతడి అల్లుడు హిమాన్షు కూడా అక్కడే ఉన్నాడు. ఏం జరిగందని అడగ్గా మేమిక్కడ చేపలకు ఆహారం వేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి తనను తిడుతూ తుపాకీతో కాల్చాడని చెప్పాడని డీసీపీ తెలిపారు. సుందర్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిచినట్లు చెప్పారు. 

ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. గాయపడ్డ సుందర్‌కు కొన్ని అ‍ప్పులున్నాయని, అప్పులు ఇచ్చిన వారిని కేసులో ఇరికించేందుకే అల్లుడితో కాల్పులు జరిపించుకుని డ్రామా ఆడాడని తేలింది. సుందర్‌ అల్లుడు హిమాన్షు ఇంటరాగేషన్‌లో పోలీసులకు అన్ని విషయాలు చెప్పాడు. కాల్చిన తర్వాత తుపాకీని అక్కడే ఉన్న చెరువులో పడేసినట్లు వెల్లడించాడు. అక్కడికి వెళ్లి వెతికిన పోలీసులకు తుపాకీ దొరికింది. దీంతో పోలీసులు సుందర్‌తో పాటు హిమాన్షుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

      

మరిన్ని వార్తలు