Viral Video: చెల్లితో పాములకు రాఖీ కట్టించబోయాడు.. ప్రాణాలు కోల్పోయాడు

23 Aug, 2021 20:43 IST|Sakshi

పాట్నా: రక్షాబంధన్ నేపథ్యంలో తన సోదరితో పాములకు రాఖీ కట్టించే ప్రయత్నంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బీహార్‌లోని సరన్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం రాఖీ పండగ సందర్భంగా పాములు పట్టే 25 ఏళ్ల మన్మోహన్ తన సోదరితో పాముల జంటకు రాఖీ కట్టించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను రెండు పాముల తోకలను పట్టుకున్నాడు. ఇంతలో ఒక పాము ఏమరుపాటుగా ఉన్న మన్మోహన్‌ కాలి బొటన వేలుపై కాటు వేసింది. 

ఊహించని హఠాత్పరిణామంతో షాక్‌ తిన్న మన్మోహన్‌.. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లాడు. అయితే అప్పటికే విషం శరీరం మొత్తం వ్యాపించడంతో ప్రాణాలు కోల్పోయాడు. పదేళ్లుగా పాముల సంరక్షణకు పాటుపడిన మన్మోహన్‌ పాము కాటు వల్లే మరణించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, మన్మోహన్‌ పాములకు రాఖీ కట్టించే ప్రయత్నం మొత్తాన్ని సెల్‌ఫోన్లలో బంధించిన స్థానికులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 
చదవండి: పట్టాలపై సెల్‌ఫోన్‌లో బిజీ.. నలుగురిని చిదిమేసిన రైలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు