పోర్ట్‌లో సింహాలా గుంపు.. వైరల్‌ వీడియో

6 Jul, 2021 17:18 IST|Sakshi

గాంధీనగర్‌: క్రూర మృగాలు చాలా వరకు అడవులలో ​ఎక్కువగా ఉంటాయి. ఒక్కొసారి ఆహారం కోసం, నీటి జాడను వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చిన సంఘటనలు కోకొల్లలు. సాధారణంగా ‍సింహాన్ని జూపార్కు బోనులో ఉన్నప్పుడు చూడటానికే చాలా మంది భయపడిపోతుంటారు. దాని గాండ్రింపు, ఆకారం, పెద్దదైనా జూలు చూస్తేనే వెన్నులో వణుకుపుడుతుంది. అయితే, అలాంటి సింహాలు జనావాసాల్లోకి వస్తే.. ఇంకేమైనా ఉందా!.. అయితే, తాజాగా ఇలాంటి సంఘటన గుజరాత్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది.

వివరాలు..  సింహాలా గుంపు తన పిల్లలతో కలిసి అడవికి దగ్గరగా ఉన్న పిపావవ్‌ ఓడరేవులోకి ప్రవేశించాయి. అంతటితో ఆగకుండా సింహాలు, వాటి పిల్లలు గాండ్రిస్తు పోర్ట్‌లో అటూ ఇటూ తిరిగాయి. ఈగుంపును చూసిన అక్కడి కార్మికులు, సెక్యురిటీ సిబ్బంది భయంతో వణికిపోయారు. వెంటనే స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియోలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘నగర పర్యటనకు వచ్చిన సివంగి గ్యాంగ్‌..’, ‘వామ్మో.. వాటిని చూస్తేనే భయం వేస్తుంది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో సింహాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వాటికి అనుకూలంగా సహజ ఆవాసాలు ఏర్పాటు చేశారు. గుజరాత్‌ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2020లో సింహాల జనాభా 29 శాతం పెరిగింది. అదే విధంగా, గిర్‌ అడవిలో 674 సింహాలు ఉన్నట్లు తెలిపారు. అయితే, ప్రతి ఐదేండ్లకు ఒకసారి సింహాల సంఖ్యను లెక్కిస్తారు. 

మరిన్ని వార్తలు