రోడ్డుపై చెంపదెబ్బలు కొట్టుకున్న యువతీ,యువకుడు.. కారణం ఏంటంటే..

2 Sep, 2021 20:11 IST|Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా యువతీ, యువకులు సరదాగా ప్రాంక్‌ వీడియోలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రాంక్‌ వీడియోలు చాలావరకు ఫన్నీగా సాగినప్పటికీ...కొన్నిసార్లు మాత్రం వివాదాస్పదమవుతాయి. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ మారిన సంగతి తెలిసిందే. తాజాగా, సరదాకోసం చేసిన ఒక ప్రాంక్‌ వీడియో యువతీ, యువకులు కొట్టుకోవడం వరకు వచ్చింది. దీంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఢిల్లీలోని కానాట్‌ ప్రాంతంలో జరిగింది.

ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక పార్కులో.. సదరు యువతి సరదాగా ప్రాంక్‌ వీడియో చేస్తుంది. దీనిలో భాగంగా శీతల పానీయాలను రోడ్డుపై వెళ్తున్న యువకులపై వేసింది. ఈ క్రమంలో ఒక యువకుడిపై, సదరు యువతి శీతల పానీయాన్ని వేసింది. దీంతో అతను షాక్‌కు గురయ్యాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ యువకుడిని, యువతి నోటికొచ్చినట్లు తిట్టింది. కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.  ఈ క్రమంలో ఆ యువతి, యువకుడిని చెంపదెబ్బకొట్టింది.  

తొలుత యువకుడికి నోటమాట రాలేదు. ఆ తర్వాత అతను కూడా యువతిని లాగిపెట్టి కొట్టాడు. ఈ సంఘటనతో చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున గుమిగూడారు. వారిద్దరి గోడవను కొందరు వేడుకలాగా చూస్తున్నారు.  మరికొందరు వారి గోడవను కూడా సెల్ఫీవీడియో తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

దీన్ని చూసిన నెటిజన్లు ‘భలే.. సరైన సమాధానం ఇచ్చావు..’,‘ ఆడవళ్లే కదా.. ఏది చేసిన చెల్లుతుంది అనుకోవద్దు..’,‘ మీ.. ప్రాంక్‌ వీడియోలకు ఒక దండం..’, ‘ఒక వ్యక్తిని కించపర్చకూడదు..’‘ఇది.. స్ర్కిప్ట్‌ చేసిన వీడియో మాదిరిగా ఉందంటూ కామెంట్‌లు పెడుతున్నారు. అయితే, గతంలో లక్నోలో ఒక యువతి నడిరోడ్డుపై ఒక క్యాబ్‌డ్రైవర్‌పై చేయిచేసుకున్న సంఘటన పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలసిందే. 

చదవండి: అరుదైన సంఘటన.. ఏనుగుకు కవల పిల్లలు!

మరిన్ని వార్తలు