వైరల్‌.. చెప్పులతో చితక్కొట్టుకున్న అంకుల్స్‌.. నీ అవ్వ తగ్గేదేలే!

10 Sep, 2022 13:01 IST|Sakshi

సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు కొన్ని వందల వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇందులో ఫన్నీ,  సందేశాత్మకం, డ్యాన్స్‌, జంతువులు.. ఇలా చాలా రకాలైనవి ట్రెండింగ్‌గా నిలుస్తుంటాయి. ఎప్పుడు, ఏ వీడియో వైరల్‌ అవుతుందో ఎవరూ చెప్పలేరు.  తాజాగా ఇద్దరు వ్యక్తులు ఓ బిల్డింగ్‌ సమీపంలో కొట్టుకుంటున్న  వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఒకరు వృద్ధుడిలా కనిపిస్తుంటే మరొకరు మధ్య వయసు ఉన్నారు.

ఇద్దరి మధ్య గొడవ ఎలా మొదలైందో తెలియదు కానీ బద్ద శత్రువుల కంటే దారుణంగా తగువులాడుకున్నారు. ఒకరిని మించి ఒకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ చితకొట్టుకున్నారు. ఇంతలో ముసలాయన తన చెప్పు తీసి ఎదుటి వ్యక్తిని కొట్టేందుకు ప్రయత్నింస్తుండగా మరో వ్యక్తి సైతం చెప్పుతో దాడి చేశాడు. ఇలా కాసేపు వీరిద్దరూ చెప్పులతో ముఖాలను వాయించుకున్నారు.ఎవరూ తగ్గకుండా సాగిన వీరి పోరాటం చివరికి హింసాత్మకంగా మారింది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు కానీ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
చదవండి: Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత ఘోరం జరిగుండేది

మరిన్ని వార్తలు