అంబానీ కుటుంబంలో మొదటి ప్రేమ వివాహం ఎవరిది?

27 Aug, 2023 12:47 IST|Sakshi

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అంబానీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్తలు అంటే ఫ్యామిలీ ఫంక్షన్‌కు సంబంధించినవి, వ్యాపారానికి సంబంధించిన వార్తలు తరచూ వింటుంటాం. అయితే అంబానీ సోదరీమణులు అంటే ధీరూభాయ్ అంబానీ కుమార్తెల గురించి అంతగా ఎవరికీ తెలియదు. అతనికి ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ మాత్రమే కాకుండా ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వీరిద్దరూ లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు. అందుకే వారి గురించిన సమాచారం బయటకు రాదు. ముఖేష్‌, అనిల్ అంబానీ సోదరీమణుల పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్. 

నీనా కొఠారి ఏం చేస్తుంటారు?
1986లో హెచ్‌సి కొఠారీ గ్రూప్ చైర్మన్ భద్రశ్యామ్ కొఠారితో నీనా వివాహం జరిగింది. అయితే భద్రశ్యామ్ క్యాన్సర్ కారణంగా 2015లో మరణించారు. హెచ్‌సీ కొఠారి గ్రూప్ ప్రధానంగా చక్కెర, కెమికల్, పెట్రోకెమికల్ వ్యాపారంలో ఉంది. నీనాకు కూతురు నయనతార, కొడుకు అర్జున్ కొఠారి ఉన్నారు. వీద్దరికీ పెళ్లయింది. నయనతార కేకే బిర్లా మనుమడు షమిత్‌ను వివాహం చేసుకుంది. ఆమె ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగింది. అంబానీ కుటుంబంలో జరిగే ప్రతి ఫంక్షన్‌కూ నీనా హాజరవుతుంటారు. 

దీప్తి సల్గాంకర్  ఎక్కడుంటారు?
అంబానీ కుటుంబంలో మొదట దీప్తి ప్రేమ వివాహం చేసుకుంది. దీప్తికి 1983లో దత్తరాజ్ సల్గాంకర్‌తో వివాహం జరిగింది. దీప్తి తండ్రి ధీరూభాయ్.. రాజ్ తండ్రి వాసుదేవ్ సల్గాంకర్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకే భవనంలో ఉండేవారు. దత్తరాజ్ సల్గాంకర్..ముఖేష్ అంబానీ మంచి స్నేహితులు. దీప్తి సల్గాంకర్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి గోవాలో ఉంటున్నారు. ఆమె భర్త దేశంలోని ప్రముఖ ఫుట్‌బాల్ జట్టు సల్గావ్కర్ యజమాని. అలాగే ఖనిజ మైనింగ్, ఇనుప ఖనిజం ఎగుమతి, రియల్ ఎస్టేట్, ఆరోగ్య రంగాలకు చెందిన వీఎం సల్గావ్కర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు యజమాని.

ఇలా ఇద్దరూ దగ్గరయ్యారు
ధీరూభాయ్ అంబానీ 1978లో ముంబైలోని ఉషాకిరణ్ సొసైటీలోని 22వ అంతస్తులో ఉండేవారు. ఈ భవనంలోని 14వ అంతస్తులో వ్యాపారవేత్త బాసుదేవ్ సల్గావ్కర్ తన కుటుంబంతో కలిసి ఉండేవారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఒకరి ఇంటికి ఒకరు వస్తూవెళుతూ ఉంటేవారు. ఈ నేపధ్యంలోనే రాజ్, ముఖేష్ అంబానీ మంచి స్నేహితులయ్యారు.  తరువాతి కాలంలో రాజ్ సల్గావ్కర్.. ముఖేష్ అంబానీ సోదరి దీప్తితో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే వారు పెళ్లికి అంగీకరించారు. దీప్తి, రాజ్‌ల వివాహం 1983లో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు విక్రమ్, కూతురు ఇషేత. 
ఇది కూడా చదవండి: భారత్‌-శ్రీలంకల ‘కచ్చతీవు’ వివాదం ఏమిటి? ఇందిరాగాంధీని ఎందుకు తప్పుబడుతున్నారు?

మరిన్ని వార్తలు