మాజీ మిస్‌ ఇండియాను పెళ్లి చేసుకున్న ఉదయ్ కోటక్ కుమారుడు

9 Nov, 2023 12:29 IST|Sakshi

ప్రసిద్ధ కోటక్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు ఉదయ్‌కోటక్‌ కుమారుడు జైకోటక్‌ మాజీ మిస్‌ ఇండియాను పెళ్లిచేసుకున్నట్లు తెలిసింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం వివాహం జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ కుటుంబానికి చెందిన ‘అంబానీ_అప్‌డేట్‌’ ఇన్‌స్టా హ్యాండిల్‌లో అంబానీ దంపతులు వివాహానికి హాజరైన చిత్రాలను పోస్ట్‌ చేసినట్లు తెలిసింది. మే 24, 2023లో జైకోటక్ తనకు కాబోయే భార్య అదితిఆర్య(మాజీ మిస్‌ ఇండియా)  యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిందని తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్‌ చేశారు. 

జైకోటక్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. అదితిఆర్య దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ సాధించింది. ​2015లో అదితి మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఎంబీఏ చదివేందుకు యూఎస్‌ వెళ్లడానికి ముందు కొన్ని హిందీ, కన్నడ సినిమాలతో పాటు తెలుగులో కల్యాణ్‌రామ్‌తో కలిసి ఇజం సినిమాలో నటించారు.

మరిన్ని వార్తలు