అందుకోసమే సీఎం జగన్‌ నాకు ఎంపీ పదవి ఇచ్చారు: ఆర్‌ కృష్ణయ్య

5 Nov, 2022 13:38 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీ సమస్యలపై గళమెత్తుతానని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌. కృష్ణయ్య అన్నారు. బీసీ సమస్యలపై పోరాటానికే సీఎం జగన్‌ తనకు ఎంపీ పదవి ఇచ్చారని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లు వివరించారు.

దేశంలో బీసీ రిజర్వేషన్లు 18 నుంచి 22 శాతం మాత్రమే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు సైతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేస్తూ బీసీ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.

'రాజ్యసభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును పాస్‌ చేయాలి. బీసీ కులాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పది లక్షల నుంచి 20లక్షలు ఇవ్వాలి. కార్పొరేట్లకు రుణమాఫీ కాదు, బీసీలకు ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇవ్వాలి. బీసీలకు చారిత్రక అన్యాయం జరిగింది' అని ఎంపీ ఆర్‌ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. 

చదవండి: (ఆ ఇద్దరూ ఏ రకంగా పోటీనో.. ఎవరికి పోటీనో చెప్పాలి: మాజీ మంత్రి వెల్లంపల్లి)

మరిన్ని వార్తలు