మహువాపై స్పీకర్‌కు నివేదిక

11 Nov, 2023 06:25 IST|Sakshi

న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలడిగిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసిన ఎథిక్స్‌ కమిటీ నివేదికను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు సమర్పించింది.

నివేదికను ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ సోంకార్‌ శుక్రవారం స్పీకర్‌ కార్యాలయంలో అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి చట్టవిరుద్ధంగా ప్రతిఫలం స్వీకరించినందుకు మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలంటూ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు