సెప్టెంబర్‌ చివరి నాటికి జైకోవ్‌–డీ వ్యాక్సిన్‌

22 Aug, 2021 03:58 IST|Sakshi

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌ మాసం మధ్య సమయానికి లేదా నెల పూర్తయ్యేలోపు జైకోవ్‌–డీ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమవుతుందని జైడస్‌ క్యాడిలా తెలిపింది. వ్యాక్సిన్‌ ధరను రానున్న రెండు వారాల్లోగా వెల్లడిస్తామని జైడస్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ షర్విల్‌ పటేల్‌ చెప్పారు. మూడు డోసుల నీడిల్‌–ఫ్రీ జైకోవ్‌–డీ వ్యాక్సిన్‌కు కేంద్రం అత్యవసర అనుమతులు ఇవ్వడం తెల్సిందే. 12–18 ఏళ్ల మధ్య వారికి అందుబాటులోకి రానున్న మొదటి టీకా ఇదే. సెప్టెంబర్‌ చివరినాటికి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమవుతుందని సంస్థ వెల్లడించింది. అక్టోబర్‌ నాటికి కోటి డోసులను, జనవరి నాటికి 4–5 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలమని ఆశిస్తున్నట్లు పేర్కొంది. దేశం వెలుపల కూడా పలు కంపెనీలతో కలసి భారీగా ఉత్పత్తి చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచంలోనే మొదటి డీఎన్‌ఏ వ్యాక్సిన్‌గా జైకోవ్‌–డీ పేరొందిన సంగతి తెలిసిందే. సంవత్సరానికి 10–12 కోట్ల డోసులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.   

మరిన్ని వార్తలు