అంతర్జాతీయ విమానాలకు ఆంక్షలు పొడిగింపు

30 Oct, 2021 08:58 IST|Sakshi

శంషాబాద్‌: కోవిడ్‌–19 ప్రారంభం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై కొనసాగుతున్న ఆంక్షలను డీజీసీఏ మరో నెల పొడిగించింది. ఇప్పటివరకు ఉన్న ఆంక్షలు నవంబరు 30 వరకు యధాతథంగా ఉంటాయని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

పరస్పర ఒప్పందం మేరకు మాత్రమే ఆయా దేశాల నడుమ అంతర్జాతీయ విమానాలు రాకపోకలు కొనసాగుతాయని తెలిపింది. కార్గోకు ఆంక్షలు వర్తించవని డీజీసీఏ పేర్కొంది.    
 

మరిన్ని వార్తలు