తానా తెలుగు తేజం పోటీలు విజేతల ప్రకటన

7 Jun, 2022 14:28 IST|Sakshi

డాలాస్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నర్విమచిన తెలుగు తేజం భాషా పటిమ పోటీలకు సంబంధించిన విజేతలను ప్రకటించారు. ఈ పోటీలు తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీఆధ్వర్యంలో 2022 జూన్ 4, 5 తేదీలలో జూమ్ లో నిర్వహించారు. ఈ పోటీలను (కిశోర, కౌమార, కౌశల) మూడు విభాగాలలో నిర్వహించగా  ప్రవాసంలో వున్న వందలాది తెలుగు పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు. మెదడుకు మేత, పదవిన్యాసం, పురాణాలు, పదచదరంగం, తెలుగు జాతీయాలు, వేమన పద్యాలు, సుమతీ శతకాలు, మన తెలుగు కవులు, తెలుగులో మాట్లాడడం వంటి సంబందిత అంశాలు పోటీలు నిర్వహించారు. 

తానా - తెలుగు పరివ్యాప్తి కమిటీ చైర్మన్ చినసత్యం వీర్నపు పొటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ ప్రసాద్ తోటకూర మదిలోనుంచి పుట్టిన ఆలోచన వల్లే ఈ పోటీలు కార్యరూపం దాల్చాయన్నారు. ఈ పోటీల నిర్వాహణకు అన్నివిధాలా సహయ సహకారాలు అందించిన  చొక్కాపు వెంకటరమణ, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మనలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ.. ఈ పోటీలు నిర్వహించడానికి దాతలుగా వున్న ప్రసాద్ తోటకూర, చినసత్యం వీర్నపు, మురళి వెన్నం, రవి పొట్లూరి, వెంకట రాజా కసుకుర్తి, లోకేష్ నాయుడు కొణిదాల, శ్రీకాంత్ పోలవరపు, న్యాయ నిర్ణేతలుగా వున్న శ్రీమతి రాజేశ్వరి నల్లాని, గీతా మాధవి, రాధిక నోరి లకు ధన్యవాదలు తెలియజేశారు. 

విజేతల వివరాలు
- కిశోర(5-10 సంవత్సరాలు) విభాగంలో –  మొదటి బహుమతి  శ్రీనిధి యలవర్తి,  రెండవ బహుమతి చాణక్య సాయి లంక, మూడవ బహుమతి వేదాన్షి చందలు గెలుచుకున్నారు.  కన్సోలేషన్ బహుమతులను శ్రీనిజ యలవర్తి, ఉదయ్ వొమరవెల్లిలకు దక్కాయి.

-  కౌమార (11-14 సంవత్సరాలు) విభాగంలో మొదటి బహుమతి రాధ శ్రీనిధి ఓరుగంటి,  రెండవ బహుమతి ఇషిత మూలే,  మూడవ బహుమతి సంజన వినీత దుగ్గిలు గెలుచుకున్నారు.  కన్సోలేషన్ బహుమతులను ద్విజేష్ గోంట్ల, ఉదయ్ వొమరవెల్లిలను వరించాయి.

- కౌశల (15-18 సంవత్సరాలు) విభాగంలో మొదటి బహుమతి శ్రీ ఆదిత్య కార్తీక్ , రెండవ బహుమతి శ్రీ షణ్ముఖ విహార్ దుగ్గి,  మూడవ బహుమతి $116 ను శ్రీ యష్మిత్ మోటుపల్లిలకు వచ్చాయి. కాగా  కన్సోలేషన్ బహుమతి శ్రీ గణేష్ నలజులకి దక్కింది.  

చదవండి: న్యూజిలాండ్‌లో తెలుగు సాహితీ సదస్సు

మరిన్ని వార్తలు