ట్విటర్‌ కొత్త సీఈవో పరాగ్‌.. యంగెస్ట్‌ సీఈవో ఘనత,కానీ చిన్న మెలిక!

30 Nov, 2021 10:28 IST|Sakshi

Twitter Parag Agrawal Youngest CEO In Top 500 Companies: మరో భారతీయుడు అత్యున్నత పదవిలో కొలువు దీరాడు. పరాగ్‌ అగర్వాల్‌ పేరును సోమవారం సోషల్‌ మీడియా జెయింట్‌ ‘ట్విటర్‌’కు సీఈవోగా ప్రకటించారు. ఈ ఫీట్‌తో సీఈవో హోదాలో పరాగ్‌ మరో అరుదైన ఘనత సాధించాడు!.  


ఎస్‌ అండ్‌ పీ(అమెరికా స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్స్‌) టాప్‌-500 కంపెనీల్లో యంగెస్ట్‌ సీఈవో ఘనత Parag Agrawal సాధించినట్లు తెలుస్తోంది. మెటా (గతంలో ఫేస్‌బుక్‌) సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వయసు 37 ఏళ్లు. పరాగ్‌ వయసు కూడా 37 ఏళ్లే! అని రిపోర్టులు చెప్తున్నాయి. కానీ, జుకర్‌బర్గ్‌(మే 14, 1984) పరాగ్‌ కంటే చిన్నవాడంట!. అయినప్పటికీ ఇద్దరి వయసు ఒకటే కావడంతో యంగెస్ట్‌ సీఈవో హోదాలో ఈ ఇద్దరూ నిలిచినట్లు అమెరికా మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరుస్తున్నాయి. విశేషం ఏంటంటే.. సెక్యూరిటీ కారణాలతో ఆయన పూర్తి ఐడెంటిటీని, ఇతర బయోడేటాను రివీల్‌ చేసేందుకు ట్విటర్‌ కంపెనీ అంగీకరించలేదు. అయితే పరాగ్‌ అగర్వాల్‌ 1984 ముంబైలో పుట్టినట్లు కొన్ని చోట్ల ప్రొఫైల్‌ను సెట్‌ చేస్తున్నారు కొందరు. సో.. అధికారికంగా ఆయన చిన్నవయస్కుడని ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

The Standard and Poor's 500(S&P 500) టాప్‌ 500 కంపెనీల్లో బెర్క్‌షైర్‌ హత్‌వే సీఈవో వారెన్‌ బఫెట్‌(95) అత్యధిక వయస్కుడిగా నిలిచారు. ఇక 500 పెద్ద కంపెనీల సీఈవో జాబితాను పరిశీలిస్తే సగటు వయసు 58 ఏళ్లుగా ఉంది. డైరెక్టర్ల వయసు సగటున 63 ఏళ్లుగా ఉంది.  కానీ, విశాల కోణంలో పరిశీలిస్తే చిన్నవయసు వాళ్లు సీఈవో అర్హతలకు దూరంగానే ఉన్నారు. అయితే ఇలాంటి సోషల్‌ మీడియా కంపెనీలను సమర్థవంతంగా నడిపేందుకు వయసు పెద్ద ఆటంకం కాకపోవచ్చని స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ లార్కర్‌ అభిప్రాయపడుతున్నారు.

ట్విటర్‌ ఫౌండర్‌, సీఈవో జాక్‌ డోర్సే(45)..  ఫైనాన్షియల్‌ సర్వీస్‌-డిజిటల్‌ పేమెంట్‌ కంపెనీ ‘స్క్వేర్‌’కు సైతం సీఈవో బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండింటి బాధ్యతలు చేపట్టడం కష్టతరమవుతున్న తరుణంలో ఆయన ట్విటర్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక పరాగ్‌కు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించాక.. జాక్‌ డోర్సే ట్విటర్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవచ్చనే అంటున్నారు. కానీ, 2022 వరకు(తన కాంట్రాక్ట్‌ ముగిసేవరకు) బోర్డులో  మాత్రం మెంబర్‌గా కొనసాగనున్నాడు.

మరిన్ని వార్తలు