రక్తహీనత రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

26 Mar, 2023 01:42 IST|Sakshi
డీఈఓ రేణుక

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాను రక్తహీనత రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని డీఈఓ సి.వి.రేణుక సూచించారు. విద్య, వైద్య ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న ఎనీమియా ముక్త్‌ భారత్‌పై శనివారం కలెక్ట రేట్‌ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ రేణుక మాట్లా డుతూ.. విద్యా శాఖ, సోషల్‌ వెల్ఫేర్‌ పరిధి లోని పాఠశాలల్లో రక్తహీనతతో బాధపడే విద్యార్థులకు రోజూ ఐరన్‌ మాత్రలు, సప్లిమెంటేషన్‌ ఆవశ్యకత, అమలును పర్యవేక్షించాల న్నారు. రాగి జావ, ఐరన్‌ టాబ్లెట్లను ప్రతి విద్యార్థీ తీసుకునేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు. దాతల సహకారంతో డ్రై అంజీర్‌ అందించడం ద్వారా రక్తహీనతను నివారించొచ్చని పేర్కొన్నారు. గోంగూర, మునగ, పాలకూర వంటి ఐరన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలను విద్యార్థులకు అందించాల న్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.రుక్మాందగయ్య, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్‌ మాధవి, పలువురు ప్రధానోపాధ్యాయులు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు