ఆర్టీసీ హౌస్‌లో ఆజాద్‌ జయంతి | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ హౌస్‌లో ఆజాద్‌ జయంతి

Published Sun, Nov 12 2023 1:48 AM

-

సాక్షి, అమరావతి: కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ విద్యనందించాలని తొలి భారత విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ చాటి చెప్పారని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌) కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఆజాద్‌ జయంతి విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ఆజాద్‌ విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పారని, కులమతాలు అతీతంగా అందరూ సోదరభావంతో బతకాలన్న సందేశాన్నిచ్చారన్నారు. తన కవితల ద్వారా ప్రజల్లో దేశభక్తిని రగిలించి, బ్రిటిష్‌ పాలనపై పోరాటం చేసేలా ప్రేరణ ఇచ్చారన్నారు. ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్టీసీ అధికారులు బషీర్‌, స్వరూపానందరెడ్డి, సామ్రాజ్యం, శోభా మంజరి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement