తెలుగు ప్రేక్షకుల ఆదరణే విజయ రహస్యం

27 Mar, 2023 01:28 IST|Sakshi
రాఘవేంద్రరావుకు పురస్కారం అందజేస్తున్న రోటరీ ప్రతినిధులు
దర్శకుడు రాఘవేంద్రరావు

విజయవాడ కల్చరల్‌: తెలుగు ప్రేక్షకుల ఆదరణే తన విజయ రహస్యమని సినీ దర్శకుడు, నిర్మాత కె.రాఘవేంద్రరావు అన్నారు. రోటర్లీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ 2023 సంవత్సరానికి కె.రాఘవేంద్రరావుకు జీవిత సాఫల్య పురస్కార కార్యక్రమాన్ని ఎంజీరోడ్డులోని వేదిక ఫంక్షన్‌ హాల్లో ఆదివారం నిర్వహించారు. పురస్కారం అందుకున్న ఆయన మాట్లాడుతూ దర్శకునిగా రామదాసు, అన్నమయ్య చిత్రాలు పూర్తి సంతృప్తినిచ్చాయన్నారు. కేఆర్‌ఆర్‌ యూట్యాబ్‌ చానల్‌ ద్వారా తన భావాలను ప్రజల ముందుకు తీసుకువస్తానన్నారు. విజయవాడతో విడదీయరాని సంబంధం ఉందని కృష్ణాజిల్లాలో జన్మించిన అనేక మంది నటులతో పనిచేసే అవకాశం కలిగిందన్నారు. రోటరీ క్లబ్‌ ఇంటర్‌ నేషనల్‌ జిల్లా అధ్యక్షుడు (3020) భాస్కర్‌ రామ్‌, రోటరీ క్లబ్‌ విజయవాడ శాఖ అధ్యక్షుడు కాజ నాగరాజు, డాక్టర్‌ పట్టాభిరామారావు, డాక్టర్‌ ఎంసీ దాస్‌, రోటరీ సంస్థ నగర బాధ్యులు వైవీ కృష్ణమోహనరావు తదితరులు పాల్గొన్నారు. గాయనీ గాయకులు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలోలని పాటలను గానం చేశారు.

మరిన్ని వార్తలు