ట్రస్ట్‌ సేవలు నిరుపమానం

27 Mar, 2023 01:32 IST|Sakshi
విద్యార్థికి స్కాలర్‌షిప్‌ అందిస్తున్న జస్టిస్‌ సోమయాజులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్స్‌ హోమ్‌ ట్రస్ట్‌ సేవలు నిరుపమానమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వి.ఎస్‌.ఎస్‌.సోమయాజులు కొనియాడారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ గాంధీనగర్‌లోని శారద కళాశాలలో ఆదివారం సాయంత్రం తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ స్టూడెంట్స్‌ హోమ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏపీ ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి జస్టిస్‌ సోమయాజులు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ పంపిణీని ప్రారంభించారు. శారద ఎడ్యుకేషనల్‌ సొసైటీ సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ కుందా సీతారామశాస్త్రి, ట్రస్ట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జంధ్యాల శంకర్‌, కార్యదర్శి జి.వి.ఎస్‌.ఎస్‌.రాఘవరావు ట్రస్ట్‌ సేవలు వివరించారు. అనంతరం 400 మంది విద్యార్థులకు రూ.3 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లను అందజేశారు. శారద ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, డాక్టర్‌ జి.ఈశ్వర్‌, కోశాధికారి మోగులూరు శ్రీకృష్ణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు