ముప్పేట దాడి

27 Mar, 2023 01:32 IST|Sakshi
మూలాలపై
● మూడు నెలలుగా మూడు దశల్లో స్పెషల్‌ డ్రైవ్‌ ● గంజాయి సరఫరా, అమ్మకందారులపై నిరంతర నిఘా ● లావాదేవీలు జరిగే ప్రాంతాలు గుర్తింపు ● 66 కేసుల్లో 158 మంది వ్యక్తులు అరెస్టు ● బానిసలుగా మారిన వారికి కౌన్సెలింగ్‌

గంజాయిని కూకటివేళ్లతో పెకిలిస్తున్న పోలీసులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘గాంజా’పై పోలీసులు పంజా విసురుతున్నారు. బెజవాడలో ‘మత్తు’ను కూకటివేళ్లతో పెకలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రతిరోజూ గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. విక్రేతలను గుర్తించి కఠినంగా శిక్షిస్తున్నారు. గంజాయి మూలాలను గుర్తించి ముప్పేట దాడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి గంజాయి ఆనవాళ్లు కనిపించకుండా ఉండేలా చర్యలు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ స్వయంగా రంగంలోకి దిగి, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

మూడు దశల్లో గంజాయి మూలాలపై దెబ్బ వేస్తున్నారు. మొదటి దశలో ఏజెన్సీ ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం ప్రాంతాల నుంచి విజయవాడకు గంజాయి సరఫరా చేస్తున్న వారిపై ఫోకస్‌ పెట్టారు. ఇంతకు ముందున్న పాత కేసులు, అమ్మకందారుల నుంచి వచ్చిన సమాచారం, పోలీస్‌ నిఘాతో 26 మందిని గుర్తించి అరెస్టు చేశారు. వారి సమాచారం పంపి కదలికపై నిఘా ఉంచాలని సంబంధిత జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

● రెండో దశలో సరఫరా దారుల నుంచి తీసుకొని వచ్చి, చిన్న చిన్న పొట్లాల కింద చేసి విక్రయించే(డ్రగ్‌ పెడలర్స్‌)ను జల్లెడ పట్టి వారి భరతం పట్టారు. ఇలా బెజవాడ నగరంలో 176 మందిని గుర్తించి వీరిలో 158 మందిని అరెస్టు చేశారు. ఇందులో స్టేషన్‌ల వారీగా యాక్టివ్‌గా ఉన్న 41 మంది కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు మూడు నెలల్లో 66 కేసుల్లో 204 మంది అనుమానితులకు గాను 158 మందిని అరెస్టు చేసి, 170.05 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. మిగతా వారిని జల్లెడ పట్టి వారి ఆట కట్టించే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా ప్రతి రోజు ఏసీపీలతో స్వయంగా ఈ డ్రైవ్‌పై సమీక్షిస్తున్నారు. తన డివిజన్‌ పరిధిలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గంజాయి అమ్మే స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగే వారిని గుర్తించి నిరంతర నిఘా ఉంచి మూలాలను పెకలిస్తున్నారు. ప్రాంతాల వారీగా పాత గంజాయి కేసుల్లో అరెస్ట్‌ అయిన వారిపై నిఘా కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు.

భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ

ఇంద్రకీలాద్రి: లోక సంరక్షణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ జరిగింది. అర్చకులు సూర్య నమస్కారాలు చేశారు.

మూడు దశల్లో..

ప్రదేశాలు గుర్తింపు..

మూడో దశలో గంజాయి అమ్మకాలు, తాగే ప్రాంతాలను పోలీసులు ప్రత్యేకంగా గుర్తించారు. ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో ముఠాలుగా ఏర్పడి కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపారు. ప్రధానంగా విజయవాడ పరిసరాల్లో కొండ ప్రాంతాలు, గుణదల ప్రాంతంలోని మధ్యకట్ట, మధురానగర్‌, మాచవరం పరిధిలో గంగిరెద్దుల దిబ్బ, క్రీస్తురాజపురం, అజిత్‌ సింగ్‌ నగర్‌ పరిధిలో బసవతారకనగర్‌, విజయదుర్గానగర్‌, కృష్ణ లంక ప్రాంతంలో స్వర్గపురి రోడ్డు, తారకరామ నగర్‌ కట్టకింద, కబేళా సెంటర్‌, నున్న ఇలా పలు ప్రాంతాలను గుర్తించి, వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు మత్తుకు బానిసలుగా మారిన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తూ, వారిలో సత్‌ ప్రవర్తనకు కృషి చేస్తున్నారు.

కమిషనర్‌ ప్రత్యేక దృష్టి..

మూడు నెలల్లో నమోదైన కేసులు ఇలా.. (2023 జనవరి నుంచి ఇప్పటి వరకు)

నెల కేసులు అరెస్ట్‌ అయిన అరెస్ట్‌ అయిన సీజ్‌ చేసిన గంజాయి సరఫరాదారులు అమ్మకం దారులు (కేజీల్లో)

జనవరి 03 – 05 3.25

ఫిబ్రవరి 25 – 45 56.19

మార్చి 38 06 108 110.61

మొత్తం 66 06 158 170.05

ఉక్కుపాదం..

గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. మూడు దశల్లో గంజాయి సరఫరాదారులు, అమ్మకం దారులు, తాగే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి ప్రభావిత ప్రాంతాలను గుర్తించి వాటిపై ఫోకస్‌ పెట్టాం. పోలీస్‌ గస్తీని ముమ్మరం చేశాం. గంజాయి సేవించే వారిని పట్టుకొని చెయిన్‌ లింక్‌ ఆధారంగా కూపీ లాగి, బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేస్తున్నాం. మూడు నెలలుగా ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది.

– టి.కె.రాణా,

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు