తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ఏర్పాట్లు

Published Fri, Nov 17 2023 1:42 AM

కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఢిల్లీరావు - Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024లో భాగంగా జనవరి ఐదో తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్న నేపథ్యంలో ఫారం–6, 7, 8లను ప్రణాళికాయుతంగా పరిష్కరిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు తెలిపారు. రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈఓ) ముకేష్‌ కుమార్‌ మీనా వెలగపూడి సచివాలయం నుంచి ఓటర్ల జాబితా సవరణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎలక్టోరల్‌ అధికారులతో గురు వారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్‌ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన ప్రగతిని సీఈఓకు వివరించారు. ఫారం 6,7,8 లను త్వరితగతిన పరిష్కరిస్తున్నామన్నారు. డిసెంబర్‌ రెండు, మూడు తేదీలను ప్రత్యేక ప్రచార రోజులుగా గుర్తించి 2024, జన వరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారందరూ కొత్తగా ఓటు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందుకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించామ న్నారు. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నా మని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చిన అంశాలను పరిశీలించి, పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. జాయింట్‌ కలెక్టర్‌ పి.సంపత్‌ కుమార్‌, విజయవాడ ముని సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌, డీఆర్వో ఎస్‌.వి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు

Advertisement
Advertisement