సోషల్‌మీడియా పోస్టులపై నిరంతర నిఘా

9 Nov, 2023 00:28 IST|Sakshi
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ

గోదావరిఖని: సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని రామగుండం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అరుణశ్రీ అన్నారు. బుధవారం పలు పార్టీల నాయకులతో ఇక్కడ ఆమె సమావేశమయ్యారు. పోలింగ్‌ కేంద్రాల సంఖ్య, సదుపాయాలు, పరిసరాల పరిశీలనపై వివరించారు. నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించేలా పోలింగ్‌ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఈమేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. కొత్త పోలింగ్‌ కేంద్రాల వివరాలను వారికి తెలియజేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, పరిసరాల శుభ్రత, మెడికల్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌, వృద్ధులు, వికలాంగులకు వీల్‌చైర్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. నామినేషన్‌ దాఖలు చేసిన రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రచార సభలు, సమావేశాలు, మీడియా పబ్లి సిటీ తదితర అనుమతుల కోసం సువిధ పోర్టల్‌లో 48గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియా పోస్టులు, ఫిర్యాదులపై రామగుండం నియోజకవర్గంలో టోల్‌ఫ్రీ నంబరు 18004256521ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఆమె తెలిపారు.

రామగుండం రిటర్నింగ్‌ అధికారి అరుణశ్రీ

మరిన్ని వార్తలు