పెద్దపల్లిలో ఆరు మండలాలు..

18 Nov, 2023 01:40 IST|Sakshi

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో ఓటరు తుదిజాబితా సిద్ధమైంది. మొత్తం ఓటర్లు 7,11,727 మందదిగా తేలింది. జాబితాలో ఓటరు పేరు, చిరునామా వివరాలు, ఫొటోలతో కూడిన జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 3,53,953 మంది పురుషులు ఉంటే 3,37,722 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 52మంది ట్రాన్స్‌జెండర్లు ఓటుహక్కు కలిగిఉన్నారు. జిల్లాలో 837 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పెద్దపల్లిలో ఆరు మండలాలు..

పెద్దపల్లి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఇందులో పెద్దపల్లి, శ్రీరాంపూర్‌, ఓదెల, సుల్తానాబాద్‌, ఎలిగేడు, జూలపల్లి.

మంథనిలో..

మంథని నియోజకవర్గంలో పది మండలాలు ఉన్నాయి. ఇందులో రామగిరి, కమాన్‌పూర్‌, పాలకుర్తి, మంథని, కాటారం, మహదేవ్‌పూర్‌, పలిమెల, మహాముత్తారం, మల్హర్‌, ముత్తారం(మంథని).

రామగుండంలో..

రామగుండం నియోజకవర్గంలో మూడు మండలాలు, ఒక కార్పొరేషన్‌ ఉన్నాయి. పాలకుర్తి, అంతర్గాం, రామగుండం మండలం, రామగుండం కార్పొరేషన్‌ ఉన్నాయి. కాగా, నియోజకవర్గంలో మొత్తం సింగరేణి బొగ్గుబావులున్న గోదావరిఖనిలోనే 1,78,599 మంది ఓటర్లుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు