ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

18 Nov, 2023 01:42 IST|Sakshi

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రి టర్నింగ్‌ అధికారి అరుణ శ్రీ అన్నారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని ఆడిటోరియం హాల్‌లో ఎన్నికల నిర్వహణ పై సెక్టార్‌ అధికారులు, బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లతో స మావేశమయ్యారు. రామగుండం నియోజకవర్గంలోని మొత్తం 263 పోలింగ్‌ కేంద్రాల్లో అన్నిసౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, జీపీఎస్‌, సీ సీ కెమెరాలు 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఈసారి పోలింగ్‌శాతం పెంపు ల క్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఓట రు స్లిప్పులు అందించాలని అన్నారు. ఇంటినుంచే ఓటువేసే విధానంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ 13 రకాల అత్యవసర సేవా విభాగాల్లో పనిచేసే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుహక్కు కల్పించిందని, వీరికోసం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద ఒ క తేదీ నిర్ణయించి, ఆరోజు పోస్టల్‌ ఓటింగ్‌ సెంటర్‌ ఏ ర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం మొదటి ఓటర్‌ స్లీప్‌ను రిటర్నింగ్‌ అధికారి అరుణశ్రీ మెప్మా పీడీ రజని, ఆర్‌పీ స్వప్న చేతుల మీదుగా అందుకున్నారు. ఏఆర్వోలు కుమారస్వామి, జ్యోతి, కార్పొరేషన్‌ కమిషనర్‌ నాగేశ్వర్‌, ఎంఈవో, మీడియా నోడల్‌ అధికారి రజని ఉన్నారు.

రిటర్నింగ్‌ అధికారి అరుణశ్రీ

మరిన్ని వార్తలు