Sakshi News home page

పోటాపోటీ ప్రదర్శనలు.. ఓటర్లకు పలకరింపులు

Published Sat, Nov 18 2023 1:40 AM

- - Sakshi

మంథని: ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచా రం ముమ్మరం చేశారు. రాష్ట్రంలోనే మంథని నియోజకవర్గం విస్తీర్ణంలో చాలా పెద్దది కావడంతో ప్రధా న పార్టీల అభ్యర్థులు కంటిమీద కునుకు లేకుండా రాత్రి, పగలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలో పది మండలాలు, సుమారు 2.30లక్షలకుపైగా టర్లు ఉన్నారు. వారిని మచ్చిక చేసుకునేందుకు, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీతో పాటు స్వతంత్రులూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మహిళలు, యువకులతో ప్రత్యేకంగా సమావేశమవుతూనే, చేరికలపై దృష్టిసారిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో సమావేశాలు నిర్వహిస్తూ పొద్దంతా గ్రామాల్లోనే అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.

గతానికి భిన్నంగా..

మంథని నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు గతం కంటే భిన్నంగా జరుగుతున్నాయి. ఓటర్లు ఎవరివై పు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొనడంతో అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీ నుంచి చంద్రుపట్ల సునీల్‌రెడ్డి తమదైన శైలిలో ప్ర చారం ముమ్మరం చేస్తున్నారు. ప్రధాన పార్టీల ము ఖ్య నాయకుల ప్రచారాలు అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. అభ్యర్థులే కాకుండా వారి బంధువులు, కూతుళ్లు, కుమారులు కూడా ఈసారి ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నారు. అభ్యర్థులు గెలుపు ధీమాలో ఎవరికి వారే ప్రచారాలు సాగిస్తున్నారు, దీంతో మంథని నియోజకవర్గంలో రసవత్తరమైన రాజీకీయ వాతావరణం నెలకొంది.

ఊపందుకున్న ఎన్నికల ప్రచారాలు

Advertisement

What’s your opinion

Advertisement