తొలి గెలుపు దక్కేదెవరికో? 

3 Dec, 2023 01:35 IST|Sakshi

బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి మొదటిసారిగా శాసనసభకు పోటీ చేసిన వారు 102 మంది 

ఎంపీగా చేసినా ఎమ్మెల్యేగా గెలవాలని బరిలోకి దిగిన కొందరు 

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో తొలిసారి ప్రధాన పార్టీల నుంచి బరిలోకి దిగిన 102 మందికి పైగా అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ‘అధ్యక్షా’అనాలనే కుతూహలంతో ఉన్నవాళ్ల పోటీ ఫలితం ఆదివారం రా నుంది. స్థానిక పరిస్థితులు, మారిన రాజకీ య సమీకరణాల నేపథ్యంలో ఈసారి అన్ని పార్టీ లూ కొత్తవారికి అవకాశాలిచ్చాయి. బీజేపీ 50 మందికిపైగా కొత్త వాళ్ళకు అవకాశమిచ్చింది.

కాంగ్రెస్‌ కూడా 45 మందికి పైగా కొత్త వాళ్ళకే టికెట్లు ఇచ్చింది. సిట్టింగ్‌లకే ఎక్కువ సీట్లిచ్చిన బీఆర్‌ఎస్‌ ఏడుగురుకి మాత్రం తొలిసారి పోటీ చేసేందుకు అవకాశమిచ్చింది. మొత్తంగా ప్రధాన పార్టీల నుంచి 102 మంది కొత్త అభ్యర్థులు బరిలో ఉన్నారని లె క్కలు చెబుతున్నాయి. మరోవైపు ఇండిపెండెంట్లు గా కూడా అనేక మంది తొలిసారి పోటీ చేస్తున్నారు. 

తొలిసారి బరిలో ఉన్న కొందరు.. 
పాలకుర్తిలో కాంగ్రెస్‌ నుంచి యశస్వినిరెడ్డి, బీజేపీ నుంచి రామ్మెహన్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. డోర్నకల్‌లో కాంగ్రెస్‌ నుంచి రాంచంద్రునాయక్, బీజేపీ నుంచి భూక్యా సంగీత, దేవరకద్రలో కాంగ్రెస్‌ నుంచి మధుసూదన్‌రెడ్డి, బీజేపీ నుంచి కొండా ప్రశాంత్‌రెడ్డి, వనరిపర్తిలో కాంగ్రెస్‌ నుంచి మేఘారెడ్డి, బీజేపీ నుంచి అనుజ్ఞారెడ్డి, మక్తల్‌ నుంచి వాకిటి శ్రీహరి, బీజేపీ నుంచి జలంధర్‌రెడ్డి, గద్వాలలో కాంగ్రెస్‌ నుంచి సరిత, బీజేపీ నుంచి బోయ శివారెడ్డి, మహబూబ్‌నగర్‌లో బీజేపీ నుంచి మిథున్‌రెడ్డి, నారాయణపేటలో పర్ణికారెడ్డి, అలంపూర్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి కె విజయుడు, బీజేపీ నుంచి రాజగోపాల్, ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌ జాన్సన్‌ నాయక్, కోరుట్లలో బీఆర్‌ఎస్‌ నుంచి డాక్టర్‌ సంజయ్‌ పోటీ చేయగా... బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న అర్వింద్‌ ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

అదేవిధంగా మెదక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రోహిత్‌రావు, బీజేపీ నుంచి విజయ్‌కుమార్, నర్సాపూర్‌లో కాంగ్రెస్‌ నుంచి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ తరఫున మురళీయాదవ్, తుంగతుర్తిలో కాంగ్రెస్‌ టికెట్‌పై మందుల సామేలు, బీజేపీ నుంచి రామచంద్రయ్య, ఆలేరులో కాంగ్రెస్‌ తరఫున బీర్ల ఐలయ్య, బీజేపీ టికెట్‌పై పడాల శ్రీనివాస్, ఆర్మూర్‌లో కాంగ్రెస్‌ నుంచి వినయ్‌రెడ్డి బీజేపీ తరఫున పైడి రాకేష్రెడ్డి, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి సంతో ష్ కుమార్, బీజేపీ టికెట్‌పై సారంగపాణి, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్‌ నుంచి జగదీశ్వర్‌గౌడ్, బీజేపీ నుంచి రవికుమార్, కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై లాస్య నందిత, కాంగ్రెస్‌ తరఫున జీవీ వెన్నెల, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ టికెట్‌పై అజహరుద్దీన్, బీజేపీ నుంచి దీపక్‌రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు