అమిత్ షా చెప్పింది రైటే.. వచ్చే ఎన్నికల్లో జరిగేది అదే.. 

4 Aug, 2023 07:41 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రెవేశ పెట్టిన సమయంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మీ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మోదీనే అధికారంలోకి వస్తారని అన్నారు. అమిత్ షా వ్యాఖలపై స్పందిస్తూ.. అమిత్ షా చెప్పింది కరెక్టే వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో INDIA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. 

సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీలో అధికారాలపై పట్టు కోసం ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం ఎలాగైనా పార్లమెంటులో బిల్లును ఆమోదింప చేసుకోవాలన్న మొండి పట్టుదలతో ఉంది. ఈ నేపధ్యంలో గురువారం బిల్లును ప్రవేశ పెడుతూ అమిత్ షా ప్రతిపక్ష INDIA కూటమిని టర్గెట్ చేసి.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది మేమే.. మీరంతా కొత్తగా ఏర్పడిన మీ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమంటూ వ్యాఖ్యలు చేశారు. 

సమావేశాల అనంతరం విపక్ష కూటమిలో ప్రధాన సభ్యురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విలేఖరుల సమావేశంలో అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించారు. తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ అమిత్ షా చెప్పింది వాస్తవం. ఢిల్లీలోనే పార్లమెంటు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అధికారం INDIA కూటమిదే. మాతృభూమిని కాపాడుకోవడం కోసమే INDIA  కూటమి ఏర్పడిందన్నారు. 

NDA బలహీనమైందని అందులోని వారంతా కూటమిని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్లిపోయారని అన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగి దేశం మరింత దయనీయ స్థితికి చేరకుండా, మతపరమైన విద్వేషాలు చెలరేగకుండా ఉండాలంటే మా కూటమి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. వారు దేశమంతా కాషాయమయం చేసేస్తామంటున్నారు. మాకు కూడా కాషాయమంటే ఇష్టమే... కానీ మిగతా రంగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.   

ఇది కూడా చదవండి: ‘మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలి’

మరిన్ని వార్తలు