బడుగుల ఆత్మగౌరవం సీఎం జగన్‌

29 Oct, 2023 05:50 IST|Sakshi
వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా

బాబు హయాంలో బడుగుల పట్ల వివక్ష చూపారు 

బడుగులకు చంద్రబాబు చేసింది శూన్యం 

పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అవమానించారు 

సీఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు, మహిళలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు 

డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా 

సాక్షి ప్రతినిధి, కడప: బడుగుల పట్ల నాడు చంద్రబాబు వివక్ష చూపగా, నేడు సీఎం జగన్‌ అదే బడుగుల ఆత్మగౌరవాన్ని పెంచారని డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజాద్‌ బాషా చెప్పారు. బీసీలు తమ పేటెంట్‌ అని చెప్పుకునే చంద్రబాబు వారికి చేసింది శూన్యమని అన్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామా జిక సాధికార యాత్రలో భాగంగా శనివా­రం వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో జరగిన బహిరంగ సభ లో అంజాద్‌ బాషా ప్రసంగించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఎన్నికల్లో వాడుకొని, ఆ తర్వాత అవమానించిన వ్యక్తి అని ఆయన చెప్పారు.

ఎస్సీలలో పుట్టాలని ఎవరనుకుంటారంటూ హేళన చేశారని, బీసీలను తోక కత్తిరిస్తానని హెచ్చరించిన ఘనత కూడా బాబుదేనన్నారు. సీఎం  జగన్‌ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మ­హిళలకు అన్ని రంగాల్లో, అన్ని పద వుల్లో అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని, దేశంలోనే సామాజిక విప్లవాన్ని తీసుకువచ్చిన ఏకైక సీఎం అని చెప్పారు. ఎ­స్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లంతా ఆత్మగౌరవంతో బతకాలంటే జగన్‌ను మళ్లీ సీఎంని చేసుకోవాలన్నారు. 

బీసీల బలం, ధైర్యం వైఎస్‌ జగనే : మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ 
వెనుకబడిన వర్గాల బలం, ధైర్యం సీఎం వైఎస్‌ జగనే అని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ చెప్పారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల పేటెంట్‌ హక్కు వైఎస్‌ జగనే అని తెలిపారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఎంతో మందిని ఆయన రాజకీయంగా ఉన్నత స్థితికి తెచ్చారన్నారు. 2019కి ముందు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పదవులు ఉన్నాయి?, ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయో బేరీజు వేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు అండగా ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. 

జగనన్న సామాజిక న్యాయానికి రోల్‌ మోడల్‌ : ఎంపీ మస్తాన్‌రావు 
దేశంలో సామాజిక న్యాయానికి రోల్‌ మోడల్‌ సీఎం వైఎస్‌ జగన్‌ అని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. 8 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలు ఉండటమనేది సీఎం జగన్‌తోనే సాధ్యమైందన్నారు. బీసీ గణన కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు వేయాలని తమకు సూచించి, అందుకోసం రాష్ట్రంలో ఒక కమిటీ వేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, రూ.లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ కోసం పార్లమెంటులో పోరాడాలని సూచించారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌  అండతోనే మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ కోసం పార్లమెంటులో పోరాడామని చెప్పారు. 

కుట్రలు చేసే వారికి గుణపాఠం చెప్పాలి : ఎంపీ గురుమూర్తి 
పేదలకు మేలు జరగకుండా కుట్రలు, కుతంత్రాలు చేసే వారికి గుణపాఠం చెప్పాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి పిలుపునిచ్చారు. పేదలైన దళిత, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్‌ జగన్‌ సంపన్నులుగా చేస్తున్నారని చెప్పారు. పేదరిక నిర్మూలనను సీఎం వైఎస్‌ జగన్‌ ఒక యజ్ఞంలా చేస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. సామాజిక సాధికారతకు నిజమైన అర్థం చెప్పారన్నారు. చిన్న పిల్లలు తినే తిండి మొదలుకొని వారి చదువు, వేసుకునే దుస్తులు, పుస్తకాలు, ట్యాబ్‌ల వంటివన్నీ ముఖ్యమంత్రే వ్యక్తిగతంగా పరిశీలించడం గతంలో ఎన్నడూ లేదన్నారు. వైఎస్సార్‌సీపీలో ఉన్న స్వేచ్ఛ, గౌరవం మరే పార్టీ లో ఉండదని తెలిపారు.

భారతదేశ చరిత్రలో ఇంటి వద్దకే పాలన అందించిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌దేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అన్నారు. లంచాలు లేకుండా సంక్షేమం అందిస్తున్నారని చెప్పారు. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటే ఏమిటో ఇప్పుడు మనం చూస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీ లకు 4 ఎమ్మెల్సీలు, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన చరిత్ర  కూడా వైఎస్‌ జగనన్నదేనన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ చూడలేదని  ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు.

మంచి చేసిన వైఎస్‌ జగన్‌కి అందరూ అండగా నిలవాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు మునుపెన్నడూ ఈ స్థాయిలో పదవులు దక్కలేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మేయర్‌ సురేష్బాబు అన్నారు. జిల్లాలో 372 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు పదవులు ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌దేనని చెప్పారు. ఈ సమావేశంలో సాధికార యాత్ర రాయలసీమ ఇన్‌చార్జి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు