పవన్‌ కల్యాణ్‌ జీవితంలో మమ్మల్ని ఓడించలేడు: నాని

30 Sep, 2021 17:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ జీవితంలో మమ్మల్ని ఓడించలేడని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. పవన్‌ వ్యాఖ్యలపై నాని స్పందిస్తూ.. ‘‘నువ్వు సీఎం వైఎస్‌ జగన్‌ని మాజీ ముఖ్యమంత్రిని చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు ముందు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూస్కో. 2024 లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం. నువ్వు చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి రా. చూసుకుందాం’’ అంటూ నాని పవన్‌కు సవాలు చేశారు. 
(చదవండి: పవన్‌.. నీ సైకో ఫ్యాన్స్‌ను అదుపుచెయ్‌)

‘‘పవన్‌ కల్యాణ్‌ ఏంటి మమ్మల్ని భయపెట్టేది. ఇంకో జానీ సినిమా చూపించి భయపెడతారా. పవన్‌ని చూసి ఆయన అభిమానులు భయపడతారు. పవన్‌ స్పీచ్‌లకి జనం భయపడతారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆ నాడు సోనియాగాంధీకే భయపడలేదు. అలాంటిది చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులు చదివి పవన్‌ కల్యాణ్‌ మమ్మల్ని భయపెడతారా’’ అని నాని ప్రశ్నించారు. 

చదవండి: విమర్శలు తట్టుకోలేని వాడివి రాజకీయాలకు ఎందుకొచ్చావ్‌: పోసాని

మరిన్ని వార్తలు