లోకేష్‌ ఏం మాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థం కాదు

19 Aug, 2021 12:20 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

తూర్పుగోదావరి: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసును టీడీపీ రాజకీయం చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి దిశా చట్టం తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే టీడీపీ నేతలు ఎప్పుడైనా పట్టించుకున్నారా..అని ప్రశ్నించారు. నారా లోకేష్‌ ఏంమాట్లాడుతున్నారో.. ఆయనకే అర్థంకాదని  మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు