అయ్యప్ప మాలలో ఉండి అబద్దాలు మాట్లాడొద్దు.. రోహిత్ రెడ్డికి రఘునందన్‌రావు కౌంటర్..

19 Dec, 2022 11:51 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆయన పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయ్యప్ప మాలలో ఉండి అసభ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని రోహిత్ రెడ్డి ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఈమేరకు మాట్లాడారు.

రోహిత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్‌ను దొర అని తిట్టారని, కానీ ఇప్పుడు అదే దొర వద్ద ఆయన పనిచేస్తున్నారని రఘునందన్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను డబ్బులు వసూలు చేసినట్లు  నిరూపించాలని సవాల్ విసిరారు.

కాగా.. విలేకరి వృత్తి నుంచి జీవితాన్ని ప్రారంభించిన రఘునందన్‌రావు రూ.10 కోట్ల విల్లాలో ఎలా నివసిస్తున్నారో చెప్పాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. రూ.100ల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బంతా పఠాన్‌చెరు పరిశ్రమల నుంచి వసూలు చేసిన సొమ్ము అని ఆరోపించారు.
చదవండి: TPCC Chief: బీఆర్‌ఎస్‌పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి

మరిన్ని వార్తలు