‘రాహుల్‌ గాంధీ పగ! అందుకే ఆప్‌కు కేటాయింపు’

25 Feb, 2024 11:22 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరోపణలు, విమర్శల దాడి పెరుగుతోంది. కాంగెస్‌, బీజేపీ పార్టీలు అభ్యర్థులపై ఎంపికపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ.. ఇండియా కూటమిలో భాగంగా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై తీవ్రంగా కసరత్తు చేస్తూ ఓ కొలిక్కి తీసుకువస్తోంది. బీజేపీని  ఓడించటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఇక.. బీజేపీ సైతం వారం రోజుల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యుర్థుల మొదటి జాబితాను విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయ.

ఇక.. కాంగ్రెస్‌ పార్టీ సీట్ల పంపకం ఢిల్లీ, యూపీలో కొలిక్కి రాగా గుజరాత్‌లో కూడా ఆప్‌తో పొత్తుగా భాగంగా రెండు సీట్లను కేటాయించింది.  గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆప్‌కు కేటాయించిన రెండు​ సీట్లలో భారుచా లోక్‌సభ నియోజకవర్గం ఒకటి. ఇది దివంగత కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కుటుంబానికి బలం ఉన్న నియోజకవర్గం. ఇక..  పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ భారుచా సెగ్మెంట్‌ను ఆప్‌కు ఇవ్వటంపై ఇప్పటికే అహ్మద్‌ పటేల్‌ కూతురు, కొడుకు నిరాశ వ్యక్తం చేశారు.

గుజరాత్‌తో కాంగ్రెస్‌ ఆప్‌కు కేటాయించిన సీట్లపై బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పింస్తోంది. ‘కాంగ్రెస్‌ పార్టీలో  ఇతర వారసత్వ కుటుంబాల కంటే ఒక్కరికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరిగి తెలుసు దివంగత నేత అహ్మద్‌ పటేల్‌, రాహుల్ గాంధీకి మధ్య ఉన్న విభేదాలు. కాంగ్రెస్‌ భారుచా సెగ్మెంట్‌ను ఆప్‌కు ఇవ్వటం అంటే రాహుల్‌ గాంధీ.. అహ్మద్‌ పటేల్‌  వారసత్వాన్ని అంతం చేయటమే.  ఆ కుటుంబాన్ని అవమానపరచటమే. రాహుల్ గాంధీ ఎప్పుడూ ఉపయోగించుకోని.. వదిలేయటాన్ని మాత్రమే నమ్ముతారు’ అని అహ్మద్‌ పటేల్‌ కూతురు ముంతాజ్‌ పటేల్‌ ట్వీట్‌ను బీజేపీ నేత అమిత్ మాల్వియా షేర్‌ చేశారు.

బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో కృషి చేసిన దివంగత అహ్మద్‌ పటేల్‌ కుటుంబానికి బలం ఉన్న భారుచా సెగ్మెంట్‌ను ఆప్‌కి అప్పగించటం..‘యువరాజు’ (రాహుల్‌) పగలో భాగం’ అని ఎక్స్‌‘ట్విటర్‌’లో మండిపడ్డారు.

whatsapp channel

మరిన్ని వార్తలు