అసెంబ్లీలో కనీసం ఒక గదైనా ఇవ్వండి.. ఇది ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవం: ఈటల

9 Feb, 2023 08:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఒక గది అయినా ఇవ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ బుధవారం సభలో స్పీకర్‌ను కోరారు. గతంలో పార్టీకి ఒక్కరున్నా వసతి కల్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది శాసనసభ ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవమని తెలిపారు. ఈటల ఈ అంశాన్ని సభలో ప్రస్తావించడంపై అధికార పార్టీ సభ్యులు, మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్పీకర్‌ వద్ద ఈ అంశాన్ని చర్చిస్తే బాగుంటుందని సలహా ఇస్తూ అడ్డుపడ్డారు. దీంతో సభలో ఈ అంశంపై ఈటల, అధికారపక్ష సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇదే సలహా ఇవ్వడంతో ఈటల బడ్జెట్‌పై చర్చను ప్రారంభించారు. రాష్ట్ర బడ్జెట్‌ పేదల సంక్షేమాన్ని అడ్డుకునేలా ఉందని, వీలుకాని, సాధ్యంకాని ట్యాక్సులను బడ్జెట్‌లో ఆదాయంగా చూపించడం, కేంద్రం ఇవ్వలేదని నిందలు వేయడం ప్రభుత్వానికి తగదన్నారు.

మహిళలకు వడ్డీలేని రుణాలు ఇంకా రానేలేదని, ఉద్యోగులకు జీపీఎఫ్‌లు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందని ఈటల ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.  ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ...అసెంబ్లీని బీఆర్‌ఎస్‌ల్పీ కార్యాలయంగా మార్చారని ఈటల ఆరోపించారు. 
చదవండి: బడ్జెట్‌ వాస్తవ దూరం: భట్టి

>
మరిన్ని వార్తలు