నోరు నొక్కేందుకే ఈ కుట్ర: భయపడుతూ కూచుంటే ఎలా?

17 Oct, 2023 19:04 IST|Sakshi

ప్రభుత్వ బంగ్లా రద్దు వివాదంలో ఆప్‌ ఎంపీ  రాఘవ్‌  చద్దాకి ఊరట

న్యూఢిల్లీ: బాలీవుడ్‌నటి పరిణీతి చోప్రో భర్త, ఆప్‌ ఎంపీ, రాఘవ్‌ చద్దాకు ఊరట లభించింది. ఢిల్లీలోని ప్రభుత్వం బంగ్లాను ఖాళీ చేయాలన్న ట్రయల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు  పక్కన పెట్టింది. అయితే ఏప్రిల్ ఆర్డర్‌ను రద్దు చేస్తూ అక్టోబర్ 5న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను  రాఘవ్‌ చద్దా సవాలు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.  దీంతో  రాఘవ్‌ చద్దాకు భారీ ఊరట లభించింది.

పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ, రాఘవ్ చద్దా తన ప్రభుత్వ బంగ్లాలో ఉండవచ్చని, దానిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. ఏప్రిల్ 18న సిటీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీతో కూడిన సింగిల్ బెంచ్ సమర్ధించింది. 

రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం
ఈ తీర్పుపై స్పందించిన రాఘవ్‌ చద్దా ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. తన పోరాటం ఇల్లు లేదా దుకాణం గురించి  రాజ్యంగ రక్షణ గురించి అని ట్వీట్‌ చేశారు. యువ ఎంపీగా తన నోరు నొక్కే ప్రయత్నంలో భాగంగా, రాజకీయ కక్షతోనే తన బంగ్లా కేటాయింపు రద్దు చేశారని విమర్శించారు.కోట్లాది మంది భారతీయుల తరపున మాట్లాడేవారిని, ప్రతిపక్షాలను ఉద్దేశ పూర్వకంగా టార్గెట్‌ చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని విమర్శిస్తూ తాను పార్లమెంటులో రెండు ప్రసంగాలు చేశానని, తన తొలి ప్రసంగం తర్వాత తన అధికారిక వసతి రద్దు చేశారన్నారు.అలాగే రెండో ప్రసంగం తరువాత ఎంపీగా తన సభ్యత్వాన్ని సస్పెండ్‌ చేశారని పేర్కొన్నారు. నీతిగా, నిజాయితీగా మాట్లాడితే  ఏమవుతుందో భయపడుతూంటే  ఇక ఏ ఎంపీ పని చేయలేరంటూ  తన ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు