ప్రధానికి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా: సీఎం కేసీఆర్‌

6 Aug, 2022 17:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ రూ. 1. 90 లక్షల కోట్లు ఖర్చు చేసిందని సీఏ కేసీఆర్‌ తెలిపారు.. కేంద్రం నుంచి వచ్చి కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమేనని వెల్లడించారు. రాజ్యంగబద్ధ వ్యవస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని విమర్శించారు.  సమాఖ్య స్పూర్తి, సహకార స్పూర్తిని పూర్తిగా  కాలరాస్తున్నారని మండిపడ్డారు. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని విమర్శించిన  కేసీఆర్‌.. గాంధీకి లేని అవ లక్షణాలు అంటగట్టి అవహేళన చేస్తున్నారని అన్నారు.

‘కేంద్రంలోని పెద్దలు ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తారట. ఇదేనా కో ఆపరేటివ్‌ ఫెడరలిజమంటే. ఇప్పటికైనా ప్రధాని తన బుద్ధి మార్చుకోవాలి. ఉచిత పథకాలు బంద్‌ చేయాలని అంటున్నారు. రైతులకు రైతుబంధు పథకం ఇవ్వడం తప్పా. ఉచితాలు తప్పు అయితే ఎన్‌పీఏలకు ఎందుకు ఇస్తున్నారు. ఎన్‌పీఏల పేరుతో పెద్ద స్కామ్‌​ నడుస్తోంది. కమీషన్లు తీసుకొని ఎన్‌పీఎలు ప్రకటిస్తున్నారు. ఎన్‌డీలో ఎన్‌పీఏ దందా సాగుతోంది.
చదవండి: నీతి ఆయోగ్‌ భజన బృందంగా మారిపోయింది: సీఎం కేసీఆర్‌

ఇండియా భూభాగం 83 కోట్ల ఎకరాలు. ఇందులో 40 కోట్ల ఎకరాలు వ్యవసాయ అనుకూలమైనవి. ప్రతి ఎకరాకు నీరిచ్చే వనరులు దేశంలో ఉన్నాయి. అయినా అన్నీ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. శ్రీలంక, పాకిస్థాన్‌ లాంటి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. చాలా బాధతోనే నీతి ఆయోగ్‌ను బహిష్కరిస్తున్నాం.నా నిరసనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి.

ప్రధానికి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. పాలు, చేనేత, శ్మశానాలపై జీఎస్టీ ఎత్తేయండి. గాలి తప్ప అన్నింటిపై జీఎస్టీ విధించారు, మోదీ నాకు మంచి మిత్రుడు. ఆయనకు నాకు వ్యక్తిగత విభేదాలు లేవు. కానీ దేశ ప్రగతి కోసం సంఘర్షణ తప్పదు. నా ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తానని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.
చదవండి: నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం కేసీఆర్‌ 

మరిన్ని వార్తలు