సంజయ్‌కి పాదయాత్ర చేసే అర్హత లేదు 

23 Sep, 2022 03:29 IST|Sakshi
కూనంనేని  

సాక్షి, హైదరాబాద్‌: పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, తెలివి తక్కువగా, రోగ్‌లాగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు, నాటి సాయుధ పోరాట చర్రితకు, సమాజానికి అన్యాయం చేసిన బీజేపీకి చెందిన బండి సంజయ్‌కు పాదయాత్ర చేసే అర్హత లేదన్నారు.

80 శాతం హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటయోధులు ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలను బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడారని, ఇందుకు బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన గవర్నర్‌ వ్యవస్థపై ఒక సెమినార్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు