చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్‌

17 Feb, 2023 16:45 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ఫ్రస్ట్రేషన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. చంద్రబాబును పిచ్చాస్పత్రికి పంపించాలని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. చంద్రబాబుకు గతంలోనే ప్రజలు బుద్దిచెప్పారని కామెంట్స్‌ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. 

కాగా, మంత్రి దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మనస్సుల్లో సీఎం వైఎస్ జగన్‌ నిలిచిపోయారు. ప్రజలకు ఏరోజూ వాస్తవాలు చెప్పే అలవాటు చంద్రబాబుకు లేదు. తూర్పుగోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. 2024 ఎన్నిల్లోనూ టీడీపీకి ప్రజలు తగిన బుద్ధిచెబుతారు. చంద్రబాబును మెంటల్‌ ఆసుపత్రికి పంపించాలి.  నారా లోకేష్‌ది తెలంగాణ డీఎన్‌ఏ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు