స్టేజీల మీద, లారీల మీద రంకెలా? పవన్‌కు డిప్యూటీ సీఎం కొట్టు స్ట్రాంగ్‌ కౌంటర్‌

23 Jun, 2023 15:43 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చూస్తుంటే కాపు సామాజిక వర్గం తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబుతో స్నేహం కారణంగా పవన్ మతిపోయిందని, టీడీపీ వాళ్లు రాసి ఇచ్చిన డైలాగులు, కిరాయి ఇచ్చిన వాళ్ళ స్క్రిప్ట్‌లు రెచ్చగొట్టే రీతిలో చదివేస్తే కుదరదని స్పష్టం చేశారు కొట్టు సత్యనారాయణ. పవన్ ను చూస్తే జాలేస్తుందని, కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడను పవన్ అగౌరవపరిచాడన్నారు. 

"హలో ఏపీ అంటే వీళ్లు తెలంగాణలో ఉన్నారు కాబట్టి బైబై చెప్పినట్టా? - బాబు, పవన్ తెలంగాణ వెళ్లిపోతున్నామని బైబై చెప్పినట్టు ఉంది. నిన్న అమలాపురంలో కిరాయి తీసుకున్న వ్యక్తి, కిరాయి ఇచ్చిన వ్యక్తి చెప్పిన మాటలు సినీ ఫక్కీలో చెప్పారు. ప్రజలు నవ్వుకుంటున్నారు. సిగ్గు శరం వదిలేసారా? ఏది పడితే అది మాట్లాడేస్తారా.." అంటూ పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు మంత్రి కొట్టు సత్యనారాయణ

చంద్రబాబు ఈ శతాబ్ధపు డర్టీ పొలిటీషియన్‌గా అభివర్ణించిన మంత్రి కొట్టు.. హరిరామ జోగయ్య వయసు మీద పడి మాట్లాడుతున్నారన్నారు. నాలుగు దశాబ్దాల నుంచి చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టి  పీడిస్తున్నాడని, కేవలం తన వర్గ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తాడన్నారు. వెన్నుపోటు, మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. చంద్రబాబుని ప్రజలు రాజకీయ సమాధి చేసినా.. పైకి కనబడే ఆ తలతోనే, పచ్చ మీడియా సపోర్ట్‌తో ఈ నాలుగేళ్లుగా దుష్ప్రచారం చేస్తూ రచ్చ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: కాకినాడ, పిఠాపురం.. పోటీకి సిద్ధమా? పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్ 

జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా.. అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి  లిస్టు ప్రకారం వారి దగ్గర చదివి ఇంకా ఏమైనా ఫిర్యాదులు ఉంటే తీసుకుని పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, మండలానికి సంబంధించి 2 టీమ్‌లు, పట్టణానికి సంబంధించి 3 టీమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, 30 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి 7 రోజులు ఫిర్యాదులు సేకరించడం జరుగుతుందని, క్షేత్ర స్థాయిలో ఏదేని కారణం చేత ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించాలన్న ఉద్దేశ్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సీఎం జగన్‌ పరిపాలనలో రూ. 2,16,000 వేల కోట్ల డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సక్షన్ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందచేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు