సీఎం పుట్టిన రోజు ఖర్చు రూ.500 కోట్లా? 

20 Feb, 2021 02:08 IST|Sakshi

నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ప్రశ్న

సాక్షి, ధర్పల్లి: సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని రూ.500 కోట్ల ఖర్చుతో కోటి మొక్కలు నాటామని చెప్పుకుంటున్నారని, అయితే అందులో రూ.450 కోట్లను సీఎం కేసీఆరే బకాసురుడి మాదిరిగా మింగారని బీజేపీ ఎంపీ అర్వింద్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లిలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. రూ.500 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ సెల్‌ పెడతామని ఇచ్చిన హామీని కేసీఆర్‌ విస్మరించారన్నారు. ఇప్పుడు పుట్టినరోజు ఖర్చుతోనే ఎన్‌ఆర్‌ఐ సెల్‌ పెట్టొచ్చుకదా అని అన్నారు. పుట్టినరోజుకు అంత ఖర్చు ఎలా పెడతారని నిలదీశారు. సీఎం పుట్టిన రోజున కేటీఆర్‌ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమై, దుబాయి వరకు వెళ్లారని, పరువు పోతుందని కేసీఆర్‌ తిరిగి వెనక్కి పిలిపించి పరువు కాపాడుకున్నారని అన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు