ఆసుపత్రిలో మాజీ సీఎం: క్ష్రీణించిన ఆరోగ్యం

9 Jun, 2021 16:07 IST|Sakshi

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్ నాథ్‌కు అస్వస్థత

జ్వరం , ఛాతీనొప్పి  కారణంగా ఆసుపత్రికి తరలింపు

మేదాంత ఆసుపత్రిలో చికిత్స 

సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత  కమల్ నాథ్‌  అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీ నొప్పి కారణంగా బుధవారం  ఆయనను  గురుగ్రామ్‌లోని  మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో  శ్వాసకోశ విభాగానికి తరలించి సీనియర్‌ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.  రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కమల్‌నాథ్‌ ఆరోగ్యం క్షీణిచిందని  కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా  ఒక ప్రకటనలో వెల్లడించారు. 

దీంతో పలువురు కాంగ్రస్‌ నేతలు కమల్‌ నాథ్‌  ‍త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కమల్‌నాథ్‌ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. కాగా కోవిడ్‌-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కమల్‌ నాథ్‌పై గత నెల( మే 24న) కేసు నమోంది. కరోనా వాస్తవ లెక్కలను  వెల్లడించాలన్నందుకు తనపై కేసులు పెడుతున్నారని, దేశద్రేహి అంటున్నారని  కమల్‌నాథ్‌ బీజేపీ సర్కార్‌పై  మండిపడ్డారు. మరోవైపు చాలా కాలంగా ఢిల్లీలో ఉంటున్న కమల్ నాథ్‌కు హనీ ట్రాప్‌ కేసులో సిట్‌ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు