మోదీ గుజరాత్‌లో ఉచిత కరెంట్‌ ఇస్తున్నారా? 

23 Sep, 2021 01:56 IST|Sakshi

రైతులపై భారం వేసేది బీజేపీ ప్రభుత్వమే 

‘విజయ డెయిరీ’భవన నిర్మాణ భూమిపూజలో హరీశ్‌రావు 

జమ్మికుంట (హుజూరాబాద్‌): ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్‌లో, బీజేపీ పాలిస్తున్న 18 రాష్ట్రాల్లో, కాంగ్రెస్‌ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నారా? అని ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బుధవారం జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని దుబ్బ మల్లన్న దేవాలయం సమీపంలో విజయ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రం కోసం నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజచేశారు. అనంతరం పాడి రైతులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ జమ్మికుంటలో పాడి రైతులను ఆదుకుంటామని చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.4 ప్రోత్సాహం త్వరలోనే విడుదల చేస్తామని హామీఇచ్చారు. కేంద్రప్రభుత్వం వ్యవసాయ బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తుంటే.. సీఎం కేసీఆర్‌ ఉచిత కరెంట్‌ ఇస్తూ రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రైతుబీమా, రైతుబంధు పథకాలు అమలు చేస్తే.. రైతులకు ఆర్థికంగా నష్టం చేసేది బీజేపీ ప్రభుత్వమని స్పష్టంచేశారు. దొడ్డు వడ్లు కొనేది లేదంటూ బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం అంటేనే రైతులు ఆలోచించుకోవాలన్నారు. పాడి పశువులను 50 శా తం సబ్సిడీతో రైతులకిచ్చేందుకు సీఎం యోచిస్తున్నారని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు