ముసుగు వీరుడిలా హరియాణా సీఎం, ఎందుకిలా? వీడియో వైరల్‌

8 Nov, 2023 15:19 IST|Sakshi

హరియాణా సీఎం  మనోహర్ లాల్ ఖట్టర్ పంచకులలోని జాతరలో మారువేషంలో  కనిపించడం వైరల్‌గా మారింది. రాష్ట్రంలో స్థానికంగా  నిర్వహించే జాతరకు హాజరయ్యారు. ఈ సందర్బంగా తనను ఎవరు గుర్తు పట్టకుండా ముఖానికి  కండువాతో కప్పుకొని మరీ  మంగళవారం సాయంత్రం  దర్శమనిచ్చారు. వాచ్‌మెన్ వేషంలో ఈ  వేడుక మైదానంలో షికారు చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజంగా ఈ వీడియోలో ఉన్నది  ఖట్టర్ అని ముఖ్యమంత్రి మీడియా కార్యదర్శి తర్వాత ధృవీకరించారు.

స్థానిక  వేడుకలో  ఎవరికీ అనుమానం రాకుండా  వాచ్‌మెన్‌లా  అది కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సీఎం ఖట్టర్ జనాల మధ్య  ఖాకీ రంగు దుస్తులలో , కాషాయ రంగు టోపీతో ఈ వీడియోలో కనిపించారు. అయితే హరియాణాలోని పంచకులలోని షాలిమార్ మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో  రావణ్ దహనం దృశ్యాలని తెలుస్తోంది.

హాట్ బెలూన్ ప్రాజెక్ట్
ఇది ఇలా ఉంటే ఈరోజు  ఉత్తర హరియాణాలో హాట్ బెలూన్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు.  రాష్ట్ర పర్యాటక వృద్ధితోపాటు, అక్కడి  సాహస ప్రియులను ఆకర్షించడం లక్ష్యంగా  ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్‌ చేసినట్టు సీఎం  చెప్పారు. హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణించి, లాంచ్ సందర్భంగా ప్రకృతి సఫారీ ప్రాజెక్ట్‌న ఎంజాయ్‌ చేయడం విశేషం. విమానాల్లో,  హెలికాప్టర్లలో ప్రయాణించాం.. కానీ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ సఫారీ అనేది ప్రత్యేకమైన అనుభూతి  అంటూ ట్వీట్‌ చేశారు. హరియాణాలో పర్యాటకులకు స్వాగతం! గత తొమ్మిదేళ్లుగా  రాష్ట్ర  టూరిజం అభివృద్ధికి  ఎంతో కృషి చేశామని సీఎం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు