‘వెయ్యి సార్లు చేస్తా.. జైల్లో వేసిన వెనకాడ’

25 Dec, 2023 07:32 IST|Sakshi

కోల్‌కతా: అనుకరించడం ఓ కళ అని, అనుకరించడాన్ని తాను అలాగే కొనసాగిస్తూ ఉంటానని టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బేనర్జీ అన్నారు. అయితే  పార్లమెంట్‌ భద్రత వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి మాట్లాడాలని విపక్ష ఎంపీలు పట్టుబట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలవురు ప్రతిపక్ష ఎంపీలు  కూడా సస్పెండ్‌ అయ్యారు. ఈ సస్పెన్షన్‌పై విపక్ష ఎంపీలు పార్లమెంట్‌ బయట నిరసన తెలిపాయి. నిరసనలో రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ హావభావాలను టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ వ్యంగ్యంగా అనుకరించిన తెలిసిందే. 

ఈ వ్యవహారంపై మరోసారి ఎంపీ కల్యాణ్‌ బేనర్జీ స్పందింస్తూ.. మరోసారి రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను అనుకరించారు. తాను ఇలాగే అనుకరించడం కొనసాగిస్తానని అన్నారు. అది ఒక కళారూపమని తెలిపారు. అవరమైతే వెయ్యిసార్లు అయినా ఇలానే అనుకరిస్తానని పేర్కొన్నారు. తన భావాలను వ్యక్తం చేయడానికి అన్ని రకాలుగా ప్రాథమిక హక్కులు ఉన్నాయని తెలిపారు.  ఈ విషయంలో జైలులో వేసినా  తాను వెనకడుగు వెయనని తేల్చి చెప్పారు. ఎటువంటి ప్రాధాన్యత లేని ఈ విషయాన్ని ధన్‌ఖడ్‌ పెద్దది చేస్తున్నాడని విమర్శించారు. 

చదవండి:  వికసిత్‌ భారత్‌ను నిజం చేయండి: మోదీ

కల్యాణ్‌ బెనర్జీ చేసిన అనుకరణ తనను ఎంతగానో బాధించిందని, ఇలా చేయడం తనను, తన  కులాన్ని అవమానించడమేనని రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు ధన్‌ఖడ్‌ను అనుకరించినందుకు  అదే రోజు టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీపై కేసు నమోదైంది. అభిషేక్‌ గౌతమ్‌ అనే ఓ న్యాయవాది  ఢిల్లీలోని డిఫెన్స్‌ కాలనీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు