కాంగ్రెస్‌ దోఖా పార్టీ.. సీఎం కేసీఆర్‌

8 Nov, 2023 14:30 IST|Sakshi

సాక్షి, సిర్పూర్‌ : కాంగ్రెస్‌ దోఖా పార్టీ అని సీఎం కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. బుధవారం సిర్పూర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిర్పూర్‌లో 16 వేల ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం ధరణి పోర్టల్‌ తెచ్చామన్నారు.

ధరణి తీసేస్తే కథ మళ్లీ మొదటికొస్తుందని కేసీఆర్‌ హెచ్చరించారు. ప్రజల చేతిలో ఉన్న వజజ్రాయుధం ఓటని చెప్పారు.  ‘కాం‍గ్రెస్‌ కు బాసులు ఢిల్లీలో ఉంటరు.. మాకు తెలంగాణప్రజలే బాసులు. ఓటు వేసేటపుడు విజ్ఞతతో వ్యవహరించాలి. ఇవాళ వేసే ఓటు ఐదేళ్ల మీ తలరాతను మారుస్తుంది. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూసి విచక్షణతో ఓటు వేయాలి. తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టింది’ అని కేసీఆర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు