చెమ్మచెక్క ఆడుతున్నావా? మంత్రి అనిల్‌ ఫైర్‌

17 Nov, 2020 14:27 IST|Sakshi

పోలవరం కాపర్ డ్యాం పనులను పరిశీలించిన మంత్రి అనిల్

సాక్షి, పశ్చిమగోదావరి : వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్‌‌ తెలిపారు. తరువాతి ఖరీఫ్‌కు గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామన్నారు. పోలవరాన్ని దివంగతనేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పోలవరం కాపర్ డ్యాం పనులను మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 2014 తరువాత పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా హోదా లభించిందని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ నిధులు మంజూరు చేసి సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. అనంతరం పోలవరంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాలపై విరుచుకుపడ్డారు. చదవండి: పోలవరంపై తప్పుడు ప్రచారం

కొందరు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. పోలవరం ప్రొజెక్ట్ పనుల్లో ఎక్కడా డీవియేషన్ లేదు. దీని గురించి నీవు (దేవినేని ఉమా) అడిగావు నీకు చెప్పాను. అనుమానం ఉంటే టేపుతో కొలుచుకోమన్నాను. ప్రజలను అంటారా అని ఉమా అంటున్నారు. నేను నువ్వు అడిగితే నీకే చెప్పాను. 2017లో కేంద్ర కేబినెట్‌లో ఏ అంశాలు అంగికరించారో బయటకు వచ్చి చదవగలరు. జగన్ పబ్జీ ఆడుతారు, అనిల్ ఐపీఎల్ ఆడతారని విమర్శిస్తున్నారు. నువ్వు చెమ్మ చెక్క ఆడుతున్నావా. మాట్లాడితే బూతుల మంత్రి అంటున్నావు. నువ్వు గతంలో మాట్లాడిన దానికంటే తక్కువే మాట్లాడాం. నీ గురించి క్రృష్ణా జిల్లాలో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో. ఎవర్నో చంపావు అంటున్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. ప్రాజెక్ట్ హైట్ తగ్గిస్తున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కమిషన్లకు, కాసులకు కక్కుర్తి పడింది మీరు. 2017లో అన్నింటినీ ఒప్పుకుంది మీరు. చదవండి: మే నాటికి పనులు పూర్తవ్వాలి: సీఎం జగన్‌

పోలవరంలో ఆర్ అండ్ ఆర్, పునరావాసం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. 50 వేల కోట్లలో 30 వేల కోట్లు ఉన్న ఆర్‌ఆండ్ఆర్‌ గురించి పట్టించుకోని మీరు 70 శాతం పూర్తి చేశామని ఎలా చెబుతారు. పోలవరం ప్రొజెక్ట్ పూర్తి అయిన తర్వాత పట్టిసీమ, పురుషోత్తమ పట్నం ఎందుకు. కేవలం గ్రావిటీ ద్వారా విశాఖకు నీళ్లు తీసుకోవాలనే పైపులైన్ వేయాలని అనుకుంటున్నాము. ఉమా, చంద్రబాబుకు నిబంధనలు ఏంటో తెలియదు. మొదటి ఏడాది ఎవరు పూర్తి స్ధాయిలో నీటిని నిల్వ చేయరు. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం రేట్ ఆఫ్ ఫిల్లింగ్, హై టాఫ్ ఫిల్లింగ్ ఉంటుంది. వన్ తర్డ్, టూ తర్డ్ అలా నిల్వ పెంచుకుంటూ పోతాము. 194 టీఎంసీ నిల్వ చేసేందుకు అంగుళం తగ్గకుండా ప్రొజెక్ట్ కడతాము. కండలేరులో 25 సంవత్సరాల తర్వాత 60 టీఎంసీ నీరు పెడుతున్నాము. ప్రొజెక్టుల్లో ఎక్కువనీరు నిలుపుతుంది. అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా