ఎల్లో మీడియా చెత్త రాతలు.. మంత్రి రోజా సీరియస్‌ కామెంట్స్‌

18 Dec, 2023 15:58 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ఏపీలో ఎల్లో మీడియాలో మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లు ఉండి చూడలేని కబోధిలా ప్రతిపక్షాలు తయారు అయ్యాయని ఆమె ఎద్దేవా చేశారు. ఏపీలో అభివృద్ధిని చూసి కడుపు మంటలో ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోందని మంత్రి రోజా సీరియస్‌ అయ్యారు. 

కాగా, మంత్రి రోజా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తండ్రిని మించిన తనయుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఈరోజు పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. 3257 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడం ద్వారా పేదలకు ఎంతో మేలు చేశారు. ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని దగ్గరలో ఉన్న నెట్‌ వర్క్‌ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకోవచ్చు. ఆరోగ్య సురక్ష ద్వారా టెస్టులు చేయించుకుని, సంపూర్ణ  ఆరోగ్యవంతులు అయ్యే వరకు చికిత్స అందిస్తున్నారు. 

కళ్లు ఉండి చూడలేని కబోధిలా ప్రతిపక్షాలు తయారు అయ్యాయి. రాష్ట్రంలో 32,279 కోట్లు వైద్య రంగానికి ఖర్చు చేశాం. ఉద్దానంలో కిడ్నీ సమస్యకు సీఎం జగన్‌ పరిష్కారం చూపారు. విద్య, వైద్యం రంగంలో సమూల మార్పులు తీసుకు వచ్చారు. 53వేల మంది వైద్య సిబ్బందిని నియామకం చేశారు. గతంలో 748 హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ వైద్యం అందిస్తే ప్రస్తుతం 2,309 ఆసుపత్రులు వైద్యం అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా వందల సంఖ్యలో ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో చికిత్స పొందే అవకాశం కల్పించారు. 

ప్రజలకు మంచి చేస్తే ఎన్నికల్లో గెలుపు తప్పకుండా వస్తుంది. ప్రజల మన్ననలు పొందితే సీట్లు అవే వస్తాయి, మా సీట్లు గురించి ఎల్లో మీడియా అత్యుత్సహం చూపిస్తోంది. స్థానికంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు. సీట్ల మార్పులు చేర్పులు విషయంలో ఒకటికి రెండు సార్లు మాట్లాడిన తర్వాతనే సీఎం జగన్‌ సర్దుబాటు చేస్తున్నారు. ఎల్లో మీడియా కడుపు మంటతో విషపు స్టోరీలు రాస్తున్నారు. జనసేన -టీడీపీ మేనిఫెస్టో లేదు.. సీట్లు సర్దుబాటు లేదు. వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

>
మరిన్ని వార్తలు